ఇంతకూ ఎవరా పవర్ స్టార్.. గెడ్డం ఉన్న డైరెక్టర్‌ను ఎందుకు కొడుతున్నాడు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 July 2020 4:14 PM GMT
ఇంతకూ ఎవరా పవర్ స్టార్.. గెడ్డం ఉన్న డైరెక్టర్‌ను ఎందుకు కొడుతున్నాడు..!

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏ సినిమా తీస్తాడో తెలీదు. ఏ సినిమా రిలీజ్ అంటాడో తెలీదు. ఇప్పటికే సినిమాల మీద సినిమాలను చేస్తున్నట్లు ప్రకటించిన వర్మ.. కొద్దిరోజుల కిందటే 'పవర్ స్టార్' మీద పడ్డాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలువురిపై పడ్డ ఆర్జీవీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ మీద పడ్డాడని తాజాగా తన సామాజిక మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేసిన ఫోటోలను చూస్తే అర్థమైపోతుంది.

సినిమాకు సంబంధించి వర్మ షేర్ చేస్తున్న ఫొటోలు అచ్చుగుద్దినట్టు కొందరిని పోలి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఏ స్థాయిలో వివాదాలకు కారణమవుతుందో అనే చర్చ జరుగుతోంది.ఈరోజు ఉదయం 11:37కు పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తానని చెప్పిన వర్మ.. తాను అనుకున్న పనే చేశాడు. పవర్ స్టార్ పేరులో గ్లాస్ పెట్టి మరీ టైటిల్ రివీల్ చేశాడు వర్మ. తన సినిమాలో ఉన్న క్యారెక్టర్లు ఎవరితో అయినా దగ్గరి సంబంధం ఉంటే అది తన తప్పు కాదని పోస్టులు మీద పోస్టులు పెడుతూనే వచ్చాడు వర్మ.ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుతూ ఉన్న ఫోటో అంటూ టాలీవుడ్ కు చెందిన మెగా హీరో డూప్ ను దింపాడు వర్మ. సోఫాలో సదరు పవర్ స్టార్ అనే క్యారెక్టర్ తల మీద చేయి పెట్టుకుని బాధపడుతూ ఉండగా.. ఇంకో బ్రదర్ చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మరిన్ని ఫోటోలను వరుసగా అప్లోడ్ చేశాడు వర్మ. రష్యా మహిళ కాఫీ ఇస్తున్న ఫోటోలో వెనుకాల చెగువేరా ఫోటో కూడా ఉండడం.. చేతిలో పుస్తకం కూడా ఉండడాన్ని గమనించవచ్చు.లవ్ లీ బ్రదర్స్ ఇన్ పవర్ స్టార్ అంటూ 'పవర్ స్టార్' క్యారెక్టర్ తలదించుకున్న మరో ఫోటోను అప్లోడ్ చేశాడు. గెడ్డం ఉన్న ఓ దర్శకుడు తన వెన్నంటే ఉండగా.. ఆ వ్యక్తిని కొడుతున్న ఫోటో కూడా అప్లోడ్ చేసి మరో వివాదానికి తెర తీశాడు. ఇంకా పొలం లో ఉన్న ఫోటోలను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు వర్మ. ఇంతకూ పవర్ స్టార్ క్యారెక్టర్ చేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని నెటిజన్లు తెగ ఎదురుచూస్తూ ఉన్నారు.Next Story