దేశంలోనే తొలిసారి: తల్లి గర్భంలోనే బిడ్డకు కరోనా పాజిటివ్‌.. తల్లికి నెగిటివ్‌

By సుభాష్  Published on  11 July 2020 8:38 AM GMT
దేశంలోనే తొలిసారి: తల్లి గర్భంలోనే బిడ్డకు కరోనా పాజిటివ్‌.. తల్లికి నెగిటివ్‌

కరోనా వైరస్‌ ఏ విధంగా సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రకరకాలుగా రూపాంతరం చెబుతూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా వైరస్‌ వల్ల మనిషి భయాందోళనతో బతకాల్సిన పరిస్థితి నెలకొంది. తల్లి గర్భంలోనే శిశువుకు కరోనా సోకింది. అయితే గర్భిణికి మొదట కరోనా పాజిటివ్‌ రాగా, డెలివరీ అయిన తర్వాత నెగిటివ్‌ వచ్చింది. ఇక శిశువు పుట్టిన ఆరు గంటల తర్వతా బిడ్డకు కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ వచ్చింది. ఇలాంటి కేసు దేశంలోనే తొలిసారి అని ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

నంగ్లోయికి చెందిన 25 ఏళ్ల మహిళ గర్భిణి. ఆమెకు జూన్‌ 11వ తేదీన కరోనా పాజిటివ్‌ వచ్చింది. భర్తకు కూడా కరోనా రావడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణికి జూన్‌ 25న మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ వచ్చింది. ఇక మళ్లీ జూలై 7నార్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా, నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. ఆమె మరుసటి రోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు పుట్టిన ఆరు గంటల తర్వాత చిన్నారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. బిడ్డకు కరోనా ఇన్‌ఫెక్షన్‌ అధికంగా ఉందని ఆస్పత్రి మైక్రోబయాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కీర్తి తెలిపారు. అయితే తల్లి బొడ్డుతాడు నుంచి బిడ్డకు కరోనా సోకే అవకాశం ఉందని రామ్‌ మనోహర్‌ లోహియా వైద్యులు పేర్కొన్నారు.

Next Story