ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా వైరస్‌

By సుభాష్  Published on  11 July 2020 1:59 AM GMT
ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా వైరస్‌

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట పట్టణంలో ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా సోకింది. రెండు రోజుల కిందట నారాయణపేటకు చెందిన ఆర్‌ఎంపీకి కరోనా నిర్ధారణ కావడంతో ప్రైమరీ కాంటాక్ట్‌ కింద 17 మంది రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా, వారిలో 9 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. వీరితో కలిపి ఉమ్మడి పాలమూరు జిల్లాలో శుక్రవారం 20 కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 8 మంది, నాగర్‌కర్నూల్‌లో ఇద్దరు, జోగులాంబ గద్వాలలో ఒకరు చొప్పున కరోనా మహమ్మారి బారిన పడ్డారు.

అలాగే మహబూబ్‌నగర్‌ డీఎంహెచ్‌వో కార్యాలయంలో పని చేసే ఇద్దరు సిబ్బందికి కరోనా సోకగా, టీబీ ఆస్పత్రిలో పని చేసే సూపర్‌వైజర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇక రవీంద్రనగర్‌లో ఓ యువకుడికి, టీడీగుట్టకు చెందిన మరో వ్యక్తికి కరోనా సోకింది. ఇలా వీటితోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా కొందరికి కరోనా సోకడంతో మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది. నాగర్‌ కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయనడిన వ్యక్తికి ఆస్పత్రికి చేర్చి, కరోనా పరీక్షలు చేయగా, ఆయనకు కూడా కరోనా సోకి మృతి చెందాడు. కాగా, పాలమూరు జిల్లాలో ఇప్పటి వరకూ 367 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో 25 మంది మరణాంచారు. దీంతో జిల్లాల్లో కరోనా ఏ మేరకు వ్యాపిస్తోందని అర్థమైపోతోంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా కేసుల వివరాలిలా :

మహబూబ్‌నగర్‌ : 16, 409

నాగర్‌కర్నూల్‌ : 4,706

జోగులాంబ గద్వాల : 7వేలు

నారాయణపేట : 3,204

వనపర్తి 6,301

మొత్తం కేసులు :37,622

Next Story