భారత్‌లో కరోనా కరాళనృత్యం.. 24గంటల్లో 27,114 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 July 2020 5:25 AM GMT
భారత్‌లో కరోనా కరాళనృత్యం.. 24గంటల్లో 27,114 కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశంలో లాక్‌డౌన్‌ సడలింపులు మొదలైనప్పటి నుంచి ప్రతి నిత్యం వేలసంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 27,114 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 519 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన్పటి నుంచి ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు ఇవే. వీటితో కలిపి దేశంలో కేసుల సంఖ్య 8,20,916కి చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి భారీన పడి 22,123 మంది మృత్యువాత పడ్డారు.

మొత్తం నమోదు అయిన కేసుల్లో 2,83,407 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 5,15,386 మంది కోలుకున్నారు.నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,13,07,002 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,82,511 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. మహారాష్ట్రలో అత్యధికంగా 2,30,599 పాజటివ్‌ కేసులు నమోదు కాగా.. తమిళనాడులో 1,30,261, ఢిల్లీలో 1,07,051 కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా నమోదైన 8లక్షల పై చిలుకు కేసుల్లో ఈ మూడు రాష్ట్రాలలోనే 4,67,911 కేసులు ఉన్నాయి. అంటే.. దాదాపు 70శాతం కేసులు ఈ మూడు రాష్ట్రాల నుంచే నమోదు అయ్యాయి.

Next Story