దేశ భద్రత, గోపత్య విషయంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను జూన్‌ 29, 2020న భారత ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ 59 చైనీస్‌ యాప్‌ కంపెనీలకు శుక్రవారం నోటీసులతో పాటు 79 ప్రశ్నలను పంపించింది. వీటికి గనుక సరైన సమాధానాలు చెప్పకపోతే శాశ్వతంగా నిషేదం విధించనుంది.

అందులో ఈ సంస్థలకు ఫండింగ్‌ ఎక్కడి నుంచి వస్తుంది..? డేటా మేనేజ్‌మెంట్‌, సర్వర్లు, వాటి మాతృసంస్థలకు సంబంధించిన వివరాలు, అవి ఎక్కడి నుంచి పనిచేస్తున్నాయి..? అనధికారికంగా డేటా యాక్సెస్ చేయడం..? సెక్యూరిటీ ఫీచర్లు..? నిఘా కోసం డేటాను దుర్వినియోగం చేయడం..? వంటి పలు ప్రశ్నలు ఉన్నాయి. వీటికి జూలై 22లోగా సమాధానం ఇవ్వాలని గడువు ఇచ్చింది. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన యాప్‌లు తిరిగి భారత్‌లో పనిచేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ యాప్స్‌ పనితీరుపై ఇండియన్‌ ఇంటెలిజన్స్‌ ఏజన్సీలు, గ్లోబల్‌ సైబర్‌ వాచ్‌ డాగ్‌లు కూడా భారతప్రభుత్వానికి రిపోర్టులను అందించనున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీలు ఇచ్చే సమాచారం ఈ ఏజన్సీలు ఇచ్చే రిపోర్టుతో సరిపోవాలి. అందుకు భిన్నంగా ఏం జరిగిన ఈ కంపెనీలు భారీ నష్టాన్ని భరించకతప్పవని కొంత మంది ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కంపెనీ ఇచ్చే సమాధానాలు ఒక కమిటీకి పంపిస్తారు. వారు వీటిని పరిశీలించి ప్రభుత్వానికి ఇందుకు సంబంధించిన రిపోర్టులను అందజేస్తారు. భారత ప్రభుత్వం రూపొందించిన 79 ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలపైనే ఆ యాప్స్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort