న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

November 12th Top 10 News I ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2020 సీజ‌న్ ఇలా ముగిసిందో లేదో వెంట‌నే భార‌త క్రికెట్

By సుభాష్  Published on  12 Nov 2020 4:07 PM IST
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1 తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు.. టపాకాయలు బ్యాన్‌

దీపావళి పండగ సందర్భంగా తెలంగాణ హైర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో టపాసుల బ్యాన్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. టపాసులు ఖచ్చితంగా నిషేధం విధించి తీరాల్సిందేనంటూ న్యాయస్థాNovember 12th Top 10 Newsనం స్పస్టం చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవ్వరు కూడా టపాసులు అమ్మడం కానీ, కొనడం గానీ చేయవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంతోపాటు దేశంలో కరోనా వైరస్‌ పెరుగుతున్న నేపథ్యంలో టపాకాయలు అమ్మడం, కాల్చడం నిషేధించాలంటూ న్యాయవాది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సలాం కుటుంబ స‌భ్యుల‌కు ఎక్స్‌గ్రేషియా అందజేత

క‌ర్నూల్ జిల్లా నంద్యాల ప‌ట్ట‌ణం ములసాగరంలో భార్య పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబాన్ని పరామర్శించి, ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన ఆర్థిక సహాయం రూ. 25,00,000/- ల బ్యాంక్ చెక్ ను సలాం అత్తగారిని క‌లిసి గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు ఎక్స్‌గ్రేషియాను బాధిత కుటుంబానికి అందజేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

డ్రగ్స్‌ కేసులో సిట్‌ దర్యాప్తు నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్‌ కేసుపై 2017లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ నిర్వహించింది. కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయముందని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎక్సైజ్‌ సిట్‌ పరిధి సరిపోదని సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ సంస్థలకు కేసును అప్పగించాలంటూ రేవంత్ హైకోర్టు‌ను కోరారు. దర్యాప్తునకు ఈడీ, ఎన్‌సీబీ సిద్ధంగా ఉందని పిటిషనర్‌ తరపు న్యాయవాది తెలిపారు. సిట్‌ దర్యాప్తు ఏ స్థితిలో ఉందో డిసెంబర్‌ 10లోపు తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మీకు బ్యాంకు అకౌంట్‌ ఉందా..? అయితే డిసెంబర్‌ 31లోగా ఈ పని చేయాల్సిందే

మీకు బ్యాంకు అకౌంట్‌ ఉందా..? అయితే డిసెంబర్‌ 31వ తేదీ లోగా ఈ పని చేయాల్సిందే. ఇకపై బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేయడం తప్పనిసరి. ఇప్పటికే పాన్‌ కార్డుకు ఆధార్‌ లింక్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పలుమార్లు గడువు విధించి మళ్లీ పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు బ్యాంకు ఖాతాలలకు కూడా ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేయడం తప్పనిసరి చేస్తోంది. అంతేకాకుండా రూపే కార్డును మొదటి ఆప్షన్‌ చేయాలని ఆర్థిక శాఖ మంత్రిత్వశాఖ బ్యాంకులను ఆదేశించింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆసీస్ బ‌య‌లుదేరిన భార‌త జ‌ట్టు.. టీమ్ వెంట వెళ్ల‌ని రోహిత్ శర్మ

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2020సీజ‌న్ ముగిసింది. ఇన్నాళ్లు ప్ర‌త్య‌ర్థులుగా త‌ల‌ప‌డిన ఆట‌గాళ్లు తిరిగి ఒక్క‌టిగా క‌లిసి ఆడాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ప్ర‌తిష్టాత్మ‌క ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న కోసం కోహ్లీ సారథ్యంలోని టీమ్ ఇండియా గురువారం యూఏఈ నుంచి బ‌య‌లుదేరింది. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అందులో ఆటగాళ్లు అందరూ కొత్త రకం పిపిఈ కిట్లను ధరించి ఉన్నారు. నేరుగా సిడ్ని చేరుకోనున్న భార‌త ఆట‌గాళ్లు అక్క‌డే క్వారంటైన్‌లో 14 రోజులు ఉండి ప్రాక్టీస్ చేయ‌నున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆకాశం నీ హద్దురా సినిమా 'రివ్యూ'

నిబంధ‌న‌లు పాటిస్తూ.. థియేట‌ర్ల‌ను ఓపెన్ చేసుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికి ఇంకా చాలా చోట్ల ఓపెన్ కాలేదు. ఇక థియేట‌ర్ల బంద్‌తో ఓటీటీ హ‌వా కొన‌సాగుతోంది. ఇటీవ‌ల కాలంలో ఓటీటీలో విడుదలైన అతి పెద్ద చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. సూర్య కథానాయకుడిగా 'గురు' ఫేమ్ అయిన సుధ కొంగర ద‌ర్శ‌కత్వంలో రూపుదిద్దుకున్న చిత్ర మిది. ఎయిర్ డెక్క‌న్ స్థాపించి అంద‌రికీ త‌క్కువ ధ‌ర‌కే విమాన ప్ర‌యాణ సౌక‌ర్యాం అందించిన కెప్టెన్ గోపినాథ్ జీవితంలోని అంశాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. భారీ అంచనాల మధ్య ఈ రోజే అమేజాన్ ప్రైం ద్వారా విడుదలైన ఈ చిత్రం అభిమానుల‌ను ఎంత మేరా ఆకట్టుకుందో చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన డబ్ల్యూహెచ్‌వో

కరోనా వ్యాక్సిన్‌ 'కోవ్యాక్స్‌' తయారీలో భారత్‌ చిత్తశుద్దిని కొనియాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గ్యాబ్రియేసస్‌ భారత ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రధాని చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కోవిడ్‌పై ఎంతో పోరాటం చేస్తున్నారని, కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారని కొనియాడారు. కరోనా..ప్రపంచం ఎదుర్కొంటున్న గొప్ప సమస్య, ఈ సమస్య పరిష్కారానికి కావాల్సిన వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌కు పూర్తి సహకారం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఐపీఎల్ 2021.. ఈ సారి తొమ్మిది జ‌ట్ల‌తో..!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2020 సీజ‌న్ ఇలా ముగిసిందో లేదో వెంట‌నే భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) 2021 కోసం సిద్ద‌మ‌వుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ సారి సీజ‌న్‌ను ఆల‌స్యంగా నిర్వ‌హించినా.. త‌దుప‌రి సీజ‌న్‌ను షెడ్యూల్ ప్ర‌కార‌మే భార‌త్‌లో నిర్వ‌హిస్తామ‌ని బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ 14వ సీజ‌న్‌కు మ‌రో ఆరేడు నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. ఇక ఈ సీజన్‌లో మ‌రో కొత్త జ‌ట్టు బ‌రిలోకి దిగ‌నుందని తెలుస్తోంది. క‌రోనా కార‌ణంగా ఏర్ప‌డిన న‌ష్టాన్ని పూడ్చుకునేందుకు బీసీసీఐ ఈ కొత్త ప్రాంఛైజీని తీసుకురానుంద‌నే ప్ర‌చారం..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రియుడిని ప‌రిచ‌యం చేసిన చిన్నారి పెళ్లికూతురు

బాలికావధు సీరియల్ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న న‌టి అవికా గౌర్. ఆ సీరియల్ తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు' పేరుతో రాగా.. ఇక్కడ కూడా హిట్టయింది. ఆ త‌రువాత టాలీవుడ్‌లో ఉయ్యాల జంపాల‌ సినిమాతో హీరోయిన్‌గా మారింది. 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కోవిడ్‌ సోకిన వారిలో ఆ సమస్యలు ఎక్కువ.. అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు

రోనా మహమ్మారి ప్రభావం అంతా ఇంతా కాదు. కరోనా బారిన పడిన వారి పరిస్థితి దారుణంగా మారుతోంది. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. ఈ వైరస్‌ కారణంగా ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. ఎందరో ప్రాణాలను బలి తీసుకుంది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే కరోనా బారిన పడిన వారిలో శరీరంలోని పలు అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు వైద్య నిపుణులు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story