మీకు బ్యాంకు అకౌంట్‌ ఉందా..? అయితే డిసెంబర్‌ 31లోగా ఈ పని చేయాల్సిందే

Bank Aadhar, Pan Link I మీకు బ్యాంకు అకౌంట్‌ ఉందా..? అయితే డిసెంబర్‌ 31వ తేదీ లోగా ఈ పని చేయాల్సిందే. ఇకపై బ్యాంకు

By సుభాష్  Published on  12 Nov 2020 8:00 AM GMT
మీకు బ్యాంకు అకౌంట్‌ ఉందా..? అయితే డిసెంబర్‌ 31లోగా ఈ పని చేయాల్సిందే

మీకు బ్యాంకు అకౌంట్‌ ఉందా..? అయితే డిసెంబర్‌ 31వ తేదీ లోగా ఈ పని చేయాల్సిందే. ఇకపై బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేయడం తప్పనిసరి. ఇప్పటికే పాన్‌ కార్డుకు ఆధార్‌ లింక్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పలుమార్లు గడువు విధించి మళ్లీ పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు బ్యాంకు ఖాతాలలకు కూడా ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేయడం తప్పనిసరి చేస్తోంది. అంతేకాకుండా రూపే కార్డును మొదటి ఆప్షన్‌ చేయాలని ఆర్థిక శాఖ మంత్రిత్వశాఖ బ్యాంకులను ఆదేశించింది.

ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ 73వ యాన్యువల్‌ జనరల్‌ సమావేశంకు ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బ్యాంకు కస్టమర్లకు ఇచ్చే క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుల విషయంలో రూపే ప్లాట్‌ఫామ్ కే ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పాటే ఈ ఏడాది డిసెంబర్‌ 31 నాటికి బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింక్‌ చేయడం తప్పనిసరి అని ఆదేశించారు.

డిసెంబర్ 31 నాటికి అన్ని బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ నెంబర్‌తో పాటు పాన్‌ నెంబర్‌ లింక్‌ అయి ఉండాలని బ్యాంకర్లకు మంత్రి ఆదేశించారు. అలాగే బ్యాంకింగ్‌ వ్యవస్థలో అన్‌వెరిఫైడ్‌ అకౌంట్‌ ఒక్కటి కూడా ఉండకూడదని స్పష్టం చేశారు. అయితే ఒక వేళ బ్యాంకర్లు పొడిగింపును కోరితే వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒకవేళ గడువు పొడిగించకపోతే ఆ తర్వాత ఆధార్‌, పాన్‌ లింకు చేయని ఖాతాలను పని చేయకపోవచ్చు. కాబట్టి బ్యాంకు ఖాతాలున్నవారందరూ తమ ఖాతాలకు ఆధార్‌, పాన్‌ నెంబర్‌ లింక్‌ అయి ఉందో లేదో బ్యాంకులకు వెళ్లి చెక్‌ చేసుకోవాలి. లేదా బ్యాంక్‌ అకౌంట్ సైట్‌లో వెళ్లి ఆధార్‌, పాన్‌ నెంబర్‌ లింక్‌ చేయాలి.

Next Story
Share it