తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు.. టపాకాయలు బ్యాన్‌

Crackers ban in Telangana I దీపావళి పండగ సందర్భంగా తెలంగాణ హైర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో టపాసుల

By సుభాష్  Published on  12 Nov 2020 9:38 AM GMT
తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు.. టపాకాయలు బ్యాన్‌

- టపాసులు నిషేధం విధించాల్సిందేనన్న కోర్టు

- టపాసులు అమ్మడం, కొనడం నిషేధం

- తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే కేసులు

- టపాసులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

దీపావళి పండగ సందర్భంగా తెలంగాణ హైర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో టపాసుల బ్యాన్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. టపాసులు ఖచ్చితంగా నిషేధం విధించి తీరాల్సిందేనంటూ న్యాయస్థానం స్పస్టం చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవ్వరు కూడా టపాసులు అమ్మడం కానీ, కొనడం గానీ చేయవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంతోపాటు దేశంలో కరోనా వైరస్‌ పెరుగుతున్న నేపథ్యంలో టపాకాయలు అమ్మడం, కాల్చడం నిషేధించాలంటూ న్యాయవాది ఇంద్రప్రకాశ్‌ హైకోర్టులో ప్రజావాజ్యాన్ని దాఖలు చేశారు. టపాసులు కాల్చడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, దీనిని నిషేధించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. టపాసుల కారణంగా శ్వాస కోశ ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిటిషన్‌ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. టపాసులపై బ్యాన్‌ విధించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.


అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టపాసులు బ్యాన్‌ చేయడం మేలని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇప్పటి వరకు తెరిచిన షాపులను వెంటనే మూసివేయాలని ఆదేశించింది. ఎవరైన అమ్మకాలు చేపడితే వారిపై కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే సోషల్‌ మీడియా, ప్రచార మాధ్యమాల ద్వారా టపాసులు కాల్చకుండా ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించాలని కోర్టు సూచించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టపాసులపై నిషేధం విధించిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. రాజస్థాన్‌లో టపాసులపై నిషేధం విధిస్తూ అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేసింది. అలాగే కోల్‌కతాలో కూడా టపాసులను బ్యాన్‌ చేయకపోతే తామే రంగంలోకి దిగి నిషేధిస్తామని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు న్యాయస్థానం గుర్తు చేసింది.

దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా ఉండటానికి ఇదివరకే పలు రాష్ట్రాలు టపాసులపై నిషేధం విధిస్తున్న విషయ తెలిసిందే. దేశ రాజధానితో పాటు కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే క్రాకర్స్‌ బ్యాన్‌ చేశారు.

Next Story