కోవిడ్‌ సోకిన వారిలో ఆ సమస్యలు ఎక్కువ.. అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు

Shocking facts about Covid-19 .. కరోనా మహమ్మారి ప్రభావం అంతా ఇంతా కాదు. కరోనా బారిన పడిన వారి పరిస్థితి

By సుభాష్  Published on  12 Nov 2020 2:52 AM GMT
కోవిడ్‌ సోకిన వారిలో ఆ సమస్యలు ఎక్కువ.. అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు

కోవిడ్‌ సోకిన వారిలో మరిన్ని అనారోగ్య సమస్యలు

♦ శరీరంలోని అవయవాలపై తీవ్ర ప్రభావం

♦ కోవిడ్‌ సోకిన వారిపై పరిశోధనలు

♦ ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, అమెరికా వైద్య సంస్థల పరిశోధనలు తాజా విషయాలు వెల్లడి

కరోనా మహమ్మారి ప్రభావం అంతా ఇంతా కాదు. కరోనా బారిన పడిన వారి పరిస్థితి దారుణంగా మారుతోంది. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. ఈ వైరస్‌ కారణంగా ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. ఎందరో ప్రాణాలను బలి తీసుకుంది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే కరోనా బారిన పడిన వారిలో శరీరంలోని పలు అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు వైద్య నిపుణులు. మానసికంగానూ, ఊపిరితిత్తులు, శ్వాస కోశ, నరాలపై, గుడె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తాజా పరిశోధనలలో వెల్లడైంది. ఈ వైరస్‌ బారిన పడిన వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొవల్సి ఉంటుందనే విషయలు ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అధ్యయనంలో తేలాయి. వైరస్‌ మెదడుపై ప్రభావం చూపడమేకాకుండా నిద్రలేమి, మనోవ్యథ, ఒత్తిళ్లు, ఆదుర్ధా, ఆందోళన, అయోమయం వంటి మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు తేల్చింది.

ఈ వైరస్‌ బారిన పడి కోలుకున్నవారిలో మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు పేర్కొంది. అలాగే అమెరికాలోని పలు వైద్య పరిశోధన సంస్థలు తాజాగా లక్షలాది మంది రోగుల హెల్త్‌ కార్డులు పరిశీలించి మానసిక అనారోగ్య సమస్యలు, కరోనా ప్రభావం తదితర అంశాలపై పరిశోధకులు లోతుగా విశ్లేషణ నిర్వహించారు. కరోనా సోకిన వారిలో 20 శాతం కంటే ఎక్కువ మందిలో 90 రోజుల్లోనే మానసికంగా కుంగిపోవడం, మెదుడుపై ప్రతికూల ప్రభావాలు బయటపడనట్లు గుర్తించారు. ఇలాంటి సమస్యలతోనే అధిక శాతం మంది ఆస్పత్రులకు వస్తున్నట్లు గుర్తించారు.

ఒత్తిళ్లు, కుంగుబాటు, మానసిక సమస్యలున్న వారికి ఇతరులతో పోలిస్తే 65 శాతం కోవిడ్‌ సోకే అవకాశాలు ఎక్కువని తాజా పరిశోధనల్లో తేలింది. కరోనా సోకిన వారిలో మెదడు సరిగ్గా పని చేయకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తమ పరిశీలనలో తేలినట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ తెలిపారు.

కోవిడ్‌ కేంద్ర నాడీ మండల వ్యవస్థపై ప్రత్యేక్షంగా ప్రభావం

కాగా, కోవిడ్‌ మహమ్మారికి సంబంధించి ఆందోళనలు, భయాలు వంటివి మానసిక సమస్యలు కలుగే అవకాశం ఉందని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌ కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌ మైఖేల్‌ బ్లూమ్‌ఫీల్డ్‌ అన్నారు. కోవిడ్‌ కేంద్ర నాడీ మండల వ్యవస్థపై ప్రత్యేక్షంగా ప్రభావం చూపుతుందని అన్నారు.

భయమే పెద్ద సమస్య

కోవిడ్‌ వచ్చిందని, లేదా వస్తుందని మానసిక ఒత్తిళ్లు, కుంగిపోవడం, ఆందోళనకు గురయ్యే వారిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందని, ఆందోళన, భయం, నిద్రలేమి సమస్యలతో మా వద్దకు పేషంట్లు వస్తున్నారని, కోవిడ్‌ అంటే ముందే ఏర్పడిన భయంతో పాజిటివ్‌ అని తేలాక మరింత కుంగిపోతున్నారన్నారు. కరోనా సోకకముందే సోకుతుందేమోనన్న భయం చాలా మందిలో ఉందని, దీని ద్వారానే అనారోగ్యం బారిన పడుతున్నారని తేల్చారు.

Next Story