డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
High Court Orders on Drugs Case. డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
By Medi Samrat Published on
12 Nov 2020 8:03 AM GMT

డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ కేసుపై 2017లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ నిర్వహించింది. కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయముందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎక్సైజ్ సిట్ పరిధి సరిపోదని సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ సంస్థలకు కేసును అప్పగించాలంటూ రేవంత్ హైకోర్టును కోరారు. దర్యాప్తునకు ఈడీ, ఎన్‌సీబీ సిద్ధంగా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. సిట్ దర్యాప్తు ఏ స్థితిలో ఉందో డిసెంబర్ 10లోపు తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Next Story