ప్రియుడిని పరిచయం చేసిన చిన్నారి పెళ్లికూతురు
Avika Gor confirms relationship with Milind Chandwani.
By Medi Samrat Published on 12 Nov 2020 11:01 AM ISTబాలికావధు సీరియల్ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న నటి అవికా గౌర్. ఆ సీరియల్ తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు' పేరుతో రాగా.. ఇక్కడ కూడా హిట్టయింది. ఆ తరువాత టాలీవుడ్‌లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా మారింది. 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
మద్యలో లావు తగ్గేందుకు అన్నట్లుగా కాస్త గ్యాప్ తీసుకుంది. మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నట్లుగా ఇటీవలే ప్రకటించిన అవికా గౌర్ కు పెద్దగా ఆఫర్లు ఏమీ రాలేదు. దాంతో ఈ అమ్మడు లైఫ్ లో సెటిల్ అవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తను మిలింద్ చద్వానీ తో ప్రేయలో ఉన్నానని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఆయనతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి.. నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ నాలో స్ఫూర్తిని నింపే వ్యక్తి నాకు తారసపడ్డాడు. నా లైఫ్ కు ఎట్టకేలకు లవ్ దొరికింది అంటూ ప్రేమలో మునిగి తేలుతున్న ఫీలింగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
View this post on InstagramA post shared by Avika Gor (@avikagor) on
నాకు ఈ అనుభూతిని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు. ఈ బంధం నా జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించబోతోంది. ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం మాకు లేదు. నన్ను సంతోషంగా ఉంచేందుకు నా జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడు. అది ఎంతో అందమైన అనుభవంలా అనిపిస్తోంది. ఈ ఇడియట్ నా హృదయాన్ని కదిలించాడని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది. నా జీవితాన్ని పరిపూర్ణం చేసినందుకు థాంక్స్ మిలింద్ చద్వానీ. నిండు మనసుతో నిన్ను ప్రేమిస్తున్నా.. అని ఫోటోలు షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అవికా బాయ్ ఫ్రెండ్ మిలింద్ చద్వానీ గురించి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.