91 లక్షల దాటిన కరోనా కేసులు.. ఒక్క రోజే 1.83 లక్షల కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో తీవ్ర భయాందోళన నెలకొంది. చైనాలో పుట్టిన ఈ మాయదారి మహమ్మారి ప్రపంచదేశాలను సైతం కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. మృత్యువును వెంటాడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 1.83 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది… పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పసిడి పరుగులు.. రూ. 50వేలు దాటిన బంగారం ధర

బంగారం ధర పరుగులు పెడుతోంది. పసిడి పరుగులు పెడుతుండటంతో బంగారం ప్రియులకు టెన్షన్‌ మొదలైంది. ఇప్పుడు ఏకంగా రూ.50వేలు దాటేసింది. తాజాగా హైదరాబాద్‌లో పసిడి ధర మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 200 పెరిగి ప్రస్తుతం రూ.46,300 ఉండగా, ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి, ప్రస్తుతం రూ.50,590కు ఎగబాకింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వాణిజ్య పన్నుల శాఖ అధికారిణిగా కల్నల్‌ సంతోష్‌ భార్య.!

భారత్‌ – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూర్యాపేటలోని ఆయన ఇంటికెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. కల్నల్‌ సంతోష్‌బాబు చిత్ర పటానికి నివాళులు అర్పించిన కేసీఆర్‌.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 కోట్ల చెక్కను అందించి గ్రూప్‌ -1 ఉద్యోగ నియామక పత్రం కూడా అందించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నిజమెంత: చైనీస్ యాప్స్ ను కట్టడి చేయాలని ఎన్ఐసి ప్రకటించిందా..?

భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా 20 మంది భారత సైనికులు అసువులు బాసారు. దీనికంతటికీ కారణమైన చైనాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాయ్ కాట్ చైనా అంటూ ప్రజలు ప్రముఖులు పిలుపును ఇచ్చారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గుడ్‌న్యూస్ :‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను క‌నుగొన్న నైజీరియా

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న‌ కరోనా మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాగైనా స‌రే క‌రోనాకు కళ్లెం వేయాల‌ని ఇప్పటికే 13 రకాల వ్యాక్సిన్‌ల‌ను మనుషులపై ప్రయోగించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 120కి పైగా సంస్థలు ఈ మందు తయారీలో నిమగ్నమయ్యా… పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కోవిడ్-19కు పతంజలి చెక్‌.. హరిద్వార్‌లో కరోనా మెడిసిన్‌ విడుదల చేసిన రాందేవ్‌బాబా

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతున్నాయి. పతంజలి నుంచి కనుగొన్న మెడిసిన్‌ను హరిద్వార్‌ పతంజలి యోగా పీఠ్‌ వేదికగా మంగళవారం యోగా గురువు రాందేవ్‌బాబా విడుదల చేశారు. అంతకు ముందు ఈ మెడిసిన్‌ను ఈ రోజు విడుదల చేయనున్నట్లు పతంజలి సీఈవో బాలకృష్ణ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు… పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

విషాదం: చికెన్‌లో మసాలకు బదులు విషం గుళికలు.. ఇద్దరు చిన్నారులు మృతి

ఓ వృద్ధురాలు మతిమరుపే ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. మసాలా అనుకుని చికెన్‌లో విష గుళికలు వేయడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఇద్దరు మనవళ్లు చాలా రోజుల తర్వాత అమ్మమ్మ ఇంటికి వచ్చారు. అయితే ఇంటికి మనవళ్లు వచ్చారనే ఆనందంలో అమ్మమ్మ చికెన్‌ తీసుకొచ్చింది. చికెన్‌ వండే సమయంలో మసాలకు బదులు గుళికలు వేయడంతో చికెన్‌ తిన్న ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కరోనా నుంచి కోలుకున్నవారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుందా..!

కరోనా తెచ్చే కష్టాలు అన్ని ఇన్ని కావు. చైనాలో పుట్టిన ఈ మాయదారి మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. కొందరికి కరోనా వచ్చిన తర్వాత కూడా మళ్లీ నెల రోజుల్లోనే తిరగబడే అవకాశాలున్నాయని కూడా పరిశోధనల్లో తేలింది. అయితే కరోనా నుంచి కోలుకున్న వారికి కొత్త సమస్య ఎదురవుతోంది. కరోనా నుంచి కోలుకున్న వారికి భవిష్యత్తులో యాంటీబాడి స్థాయిలు తగ్గిపోతాయని చైనా పరిశోధకులు చెబుతున్నారు… పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏపీలో కొత్తగా 462 పాజిటివ్‌ కేసులు.. 8 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 20,639 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 462 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 407 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 40 మంది.. 15 మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9834కు చేరింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జస్ట్ 15 రోజుల్లో జనాల్ని బాదేసిందెంతో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే

మహమ్మారికి చెక్ చెప్పాలంటే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అన్నంతనే చాలామంది సంతోషించినోళ్లు ఉంటే.. కొందరైతే ఏకంగా పండుగే చేసుకున్నారు. అయితే.. దాని ప్రభావం ఎంతలా ఉంటుందన్న విషయం లాక్ డౌన్ స్టార్ట్ అయిన మొదటి వారానికే అర్థమైంది. విషయం తెలీక తాము సంబరపడ్డ లాక్ డౌన్ ఇంత దారుణమైన ఫలితాలు తీసుకొస్తుందన్న వాస్తవాన్ని కోట్లాది మంది గ్రహించలేకపోయారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort