న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 26 Oct 2020 11:08 AM GMT1.బెన్ స్టోక్స్ అరుదైన ఘనత.. చేదనలో రెండు శతకాలు చేసిన ఒకే ఒక్కడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2020 సీజన్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఉత్కంఠ మ్యాచులు, సూపర్ ఓవర్ మ్యాచ్‌లతో అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తోంది. ప్లే ఆప్స్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ మినహా అన్ని జట్లు రేసులో ఉన్నాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ (107 నాటౌట్; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారంతో రాజస్థాన్.. ముంబై పై విజయం సాధించింది. ప్రస్తుతం ఐదు విజయాలు సాధించిన రాజస్థాన్ 10 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2.మరో దారుణం: శామీర్‌పేటలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్, హత్య
మహబూబాబాద్ కిడ్నాప్ ఘటన మరువక ముందే మేడ్చల్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. శామీర్‌పేటలోబ ఆలుడు అథియాన్ (5) అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. శామీర్‌పేట అవుటర్ రింగ్‌రోడ్డు పక్కన బాలుడి మృతదేహాన్ని సోమవారం పోలీసులు గుర్తించారు. శామీర్‌పేట సీఐ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం. శామీర్‌పేటకు చెందిన సయ్యద్ ఉసేన్, గౌజ్‌బీ మూడో కుమారుడు అథియాన్ స్థానిక ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. ఈనెల 15న ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3.సీఎం ఉద్ధవ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ నటి కంగనా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసు విషయమై కంగనా ఇటీవల ముంబై నగరాన్ని పీవోకేతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. మహారాష్ట్ర ప్రభుత్వం కంగనపై ఫైర్ అయ్యింది. ఇక విజయదశమి సందర్భంగా శివసేన పార్టీ దసరా వేడుకల్లో ఉద్దవ్ థాకరే కంగనాపై పరోక్షంగా విమర్శలు చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4.గీతం యూనివర్సిటీ అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు
విశాఖలోని గీతం యూనివర్సిటీ భూకబ్జాలపై విచారణ జరపాలని సోమవారం ప్రజా సంఘాల జేఏసీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. గత 40 ఏళ్లుగా గీతం యూనివర్సిటీ భూకబ్జాలకు పాల్పడిందని, వారు ఆక్రమించిన భూముల్లో ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు చేపట్టారని, విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజు అధికంగా వసూలు చేసింది. భూకబ్జాలు, అవినీతికి పాల్పడిన గీతం యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని వారు కోరారు. రాజకీయ పలుకుబడితో యూనివర్సిటీ యాజమాన్యం తప్పించుకుంటోందని, గీతం ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5.మావోలకు ఎదురు దెబ్బ.. 32 మంది లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులకు అడ్డాగా ఉన్న దంతెవాడలో భారీ సంఖ్యలో మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన 32 మంది లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 10 మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు. మావోయిస్టు పార్టీ డొల్ల సిద్దాంతాలతో విసిగి పోలీసులు ప్రకటించిన పునరావాస కార్యక్రమానికి ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ వెల్లడించారు. లొంగిపోయిన వారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6.కాబోయే భర్తతో ఫొటోలు దిగిన చందమామ.. పిక్స్ వైరల్
చందమామ కాజల్ తన పెళ్లి ప్రకటనతో అందరికి సడెన్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. తన ప్రియనేస్తం గౌతమ్ కిచ్లూతో త్వరలో ఏడడుగులు వేయనున్నానని కాజల్ అక్టోబర్ ఆరంభంలో ప్రకటించింది. వీరిద్దరి వివాహాం ఈ నెల 30న జరగనుంది. అయితే.. ఇప్పటి వరకు ఈ జంట.. వీరికి సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు గానీ పోస్ట్ చేయలేదు..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7.మాజీ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష
కేంద్ర మాజీ మంత్రి దిలీప్‌కు మూడేళ్లు జైలు శిక్ష పడింది. బొగ్గు కుంభకోణం కేసులో సోమవారం ఢిల్లీ కోర్టు ఈ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 1999లో జార్ఖండ్ బొగ్గు బ్లాక్ కేటాయింపుల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో దిలీప్ రే దోషిగా తేలారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌తో పాటు నిందితుల వాదనలు విన్న ఢిల్లీ కోర్టు.. ఈ మేరకు తీర్పునిచ్చింది. కాగా, అటల్‌బిహారీ వాజ్‌పేయ్ ప్రభుత్వంలో దిలీప్‌రే ఇంధన శాఖ మంత్రిగా పని చేశారు. దిలీప్‌తో పాటు ఈ కుంభకోణంలో సంబంధం ఉన్న ఇద్దరు సీనియర్ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ప్లేఆఫ్స్ నుంచి చెన్నై నిష్క్రమణ.. ఇదొక ఆటే అంటూ.. ధోని భార్య భావోద్వేగం
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఇప్పటి వరకు ప్రతి సీజన్‌లో ప్లే ఆఫ్ చేరిన ఏకైక జట్టు చెన్నై సూపర్ కింగ్స్. అయితే.. ఈ సీజన్‌లో ఆ జట్టు దారుణ పరాభవాలను చవిచూస్తోంది. మూడు సార్లు టైటిల్ గెలిచిన ఆ జట్టు.. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి ప్లే ఆప్స్ చేరుకునే అవకాశం కోల్పోయింది. ఆదివారం సాయంత్రం చెన్నై జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అద్భుత విజయం సాధించినా.. ముంబై ఇండియన్స్‌ను రాజస్థాన్ రాయల్స్ ఓడించడడంతో చెన్నై కథ ముగిసింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ధోని సేన నాలుగు విజయాలు మాత్రమే సాధించి 8 పాయింట్లతో.. ఆఖరి స్థానంలో నిలిచింది. మిగతా రెండు మ్యాచులు గెలిచినా.. చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు మూసుకుపోయాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9.ప్రభుత్వం బంపర్ ఆఫర్.. పెళ్లి చేసుకుంటే రూ.4లక్షలు
పెళ్లి చేసుకునే జంటలకు రూ.4లక్షలు అందించనుంది ప్రభుత్వం. హామ్మయ్య.. ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుందాం.. ప్రభుత్వం నుంచి వచ్చే రూ.4లక్షలు తీసుకుందాం అని ఆలోచిస్తున్నారా..? అయితే.. ఆ అవకాశం మీకు లేదులెండి..? ఎందుకంటారా..? ఈ పథకాన్ని ఇస్తుంది ఇండియాలో కాదులెండి జపాన్‌లో..ప్రతి యువకుడు అమ్మాయి అందుబాటులో ఉంటే వీలైనంత తొందరగా పెళ్లి చేసుకునేందుకు అమితాసక్తి చూపుతారు. అయితే.. పలు దేశాల్లో వివాహాలు చేసుకునేందుకు అమ్మాయిలు కనిపించడం లేదు. దీంతో అబ్బాయిలు ముదురు బ్యాచిలర్స్‌గానే ఉంటున్నారు. దీంతో జపాన్‌లో జననాల రేటు రోజురోజుకు తగ్గిపోతుంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10.తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఉచిత దర్శనాలకు అనుమతి
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. అలిపిరి వద్ద నుంచి భూదేవి కాంప్లెక్స్‌లో సోమవారం నుంచి సామాన్య భక్తులకు 3వేల సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తోంది. దీంతో శ్రీవారి భక్తులకు ఎంతో మేలు కలుగనుంది. ఉదయం 5 గంటల నుంచి టోకెన్లను ఇస్తున్నారు. దర్శనం టోకెన్లను పొందిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతి ఇస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి