తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఉచిత దర్శనాలకు అనుమతి

By సుభాష్  Published on  26 Oct 2020 6:52 AM GMT
తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఉచిత దర్శనాలకు అనుమతి

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. అలిపిరి వద్ద నుంచి భూదేవి కాంప్లెక్స్‌లో సోమవారం నుంచి సామాన్య భక్తులకు 3వేల సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తోంది. దీంతో శ్రీవారి భక్తులకు ఎంతో మేలు కలుగనుంది. ఉదయం 5 గంటల నుంచి టోకెన్లను ఇస్తున్నారు. దర్శనం టోకెన్లను పొందిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతి ఇస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

లాక్‌డౌన్‌ తర్వాత..

లాక్‌డౌన్‌ తర్వాత జూన్‌ 11 నుంచి శ్రీవారి ఆలయంలో దర్శనాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ప్రారంభంలో గంటకు 500 మంది భక్తుల చొప్పున రోజుకు ఆరు వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు మూడు వేలు, సర్వదర్శనం టికెట్లు మూడు వేలు ఇచ్చేవారు. తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ టికెట్ల కోటాను 9వేలకు పెంచారు. అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు మొత్తం 12 వేల మందికి శ్రీవారి ఆలయంలో దర్శనం కల్పించేవారు. కాగా, టీటీడీ ఇస్తున్న 12వేల టోకెన్లను భక్తులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసినా.. శ్రీవారిని దర్శించుకునే భక్తుల హాజరు మాత్రం తక్కువగానే ఉండేది. ఇదే సమయంలో తిరుపతిలో కరోనా వ్యాప్తి చెందడం, కరోనా కేసులు పెరుగుతుండటంతో తిరుపతి కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించింది ప్రభుత్వం. దాంతో తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది టీటీడీ.

ఆ తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉండటంతో టికెన్ల జారీని నిలిపివేసింది. ముందస్తు సమాచారం లేకుండా సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేయడంతో భక్తులు ఓ దశలో ఆందోళనకు గురయ్యారు. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేయడం, ఇదే సమయంలో రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను పెంచడంతో భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

దశల వారిగా 16 వేలకు పెంచారు. అయినా ఉచిత దర్శనం టోకెన్లను మాత్రం ఇవ్వకపోవడంతో టీటీడీ ఉన్నతాధికారులు ఆధాయం కోసమే ఉచిత దర్శనం టోకెన్లు రద్దు చేసారని చాలామంది విమర్శించారు. దశల వారీగా 16వేలకు పెంచారు. అయినా ఉచిత దర్శనం టోకెన్లను మాత్రం ఇవ్వకపోవడంతో ఆదాయం కోసమే ఉచిత దర్శనాలను ఆరోపణలు వచ్చాయి. ఎట్టకేలకు సర్వదర్శనం టోకెన్లు పునరుద్దరించడంతో సామాన్య భక్తులకు తీపి కబురే అని చెప్పాలి.

Next Story
Share it