గీతం యూనివర్సిటీ భవనాల కూల్చివేత.. భారీగా మోహరించిన పోలీసులు

By సుభాష్  Published on  24 Oct 2020 4:28 AM GMT
గీతం యూనివర్సిటీ భవనాల కూల్చివేత.. భారీగా మోహరించిన పోలీసులు

ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మించారంటూ విశాఖపట్నం గీతం యూనివర్సిటీలోని కొన్ని కట్టడాలను జీవీఎంసీ అధికారులు తొలగించారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం, ప్రహరీగోడ కొంత భాగం సెక్యూరిటీ గదులను మున్సిపల్‌ సిబ్బంది కూల్చివేశారు. జీవీఎంసీ అధికారులు జేసీబీ, బుల్‌డోజర్లతో కూల్చివేత చేపట్టారు.

ఈ కూల్చివేత సందర్భంగా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అయితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని గీతం యూనిర్సిటీ యాజమాన్యం ఆరోపిస్తోంది. అసలు కూల్చివేతకు గల కారణాలను కూడా చెప్పకుండా కూల్చివేశారని ఆరోపించింది. ఈ కూల్చివేత సందర్భంగా గీతం యూనివర్సిటీకి వెళ్లే మార్గాలను అధికారులు నిలిపివేశారు.

Next Story
Share it