ఎన్టీపీసీ మరో ఘటన.. ఫోర్బ్స్‌ జాబితాలో చోటు

By సుభాష్  Published on  23 Oct 2020 2:09 PM GMT
ఎన్టీపీసీ మరో ఘటన.. ఫోర్బ్స్‌ జాబితాలో చోటు

ప్రభుత్వ రంగ దిగ్గజ విద్యుత్‌ సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ) మరో ఘనత దక్కించుకుంది. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్‌ ఈ ఏడాది ప్రపంచంలోని అత్యుత్తమైన కంపెనీలతో రూపొందించిన జాబితాలో ఎన్టీపీసీ చోటు దక్కించుకుంది. భారత ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఎన్టీపీసీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని ఎన్టీసీపీయే ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తమ పద్దతులను అమలు చేయడంలో తమకు గల నిబద్దతకు ఈ గుర్తింపే నిదర్శమని పేర్కొంది.

రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా పని చేస్తూ ఉన్నత లక్ష్యాలను సాధిస్తామని పేర్కొంది. ఇంటెలిజెన్సీ డిజిటలైజేషన్, ఆన్‌లైన్‌ శిక్షణ ద్వారా దాని శిక్షణ పద్దతి వేలాది మంది ఉద్యోగుల జీవితాలను వెలుగులు నింపినట్లు తెలిపింది. మారుమూల ప్రాంతాల నుంచి కూడా సేవలను పొందడానికి వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది.

Next Story