ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌.. పెళ్లి చేసుకుంటే రూ.4ల‌క్ష‌లు

By సుభాష్  Published on  26 Oct 2020 7:05 AM GMT
ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌.. పెళ్లి చేసుకుంటే రూ.4ల‌క్ష‌లు

పెళ్లి చేసుకునే జంట‌ల‌కు రూ.4ల‌క్ష‌లు అందించ‌నుంది ప్ర‌భుత్వం. హామ్మ‌య్య‌.. ఇక ఆల‌స్యం చేయ‌కుండా పెళ్లి చేసుకుందాం.. ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే రూ.4ల‌క్ష‌లు తీసుకుందాం అని ఆలోచిస్తున్నారా..? అయితే.. ఆ అవ‌కాశం మీకు లేదులెండి..? ఎందుకంటారా..? ఈ ప‌థ‌కాన్ని ఇస్తుంది ఇండియాలో కాదులెండి జపాన్‌లో..

ప్రతి యువకుడు అమ్మాయి అందుబాటులో ఉంటే వీలైనంత తొందరగా పెళ్లి చేసుకునేందుకు అమితాసక్తి చూపుతారు. అయితే.. పలు దేశాల్లో వివాహాలు చేసుకునేందుకు అమ్మాయిలు కనిపించడం లేదు. దీంతో అబ్బాయిలు ముదురు బ్యాచిలర్స్‌గానే ఉంటున్నారు. దీంతో జపాన్‌లో జననాల రేటు రోజురోజుకు తగ్గిపోతుంది. త 25 ఏళ్ళ నుంచి జపాన్ వృద్ధుల సంఖ్య పెరుగుతూ..సంతానలేమి ఏర్పడుతోంది. దీన్ని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.

యువతీ యువకులను పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించడం ద్వారా పడిపోతున్న జననాల రేటును తిరిగి గాడిన పెట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు ఆరు లక్షల యెన్‌లు (భారత కరెన్సీలో రూ. 4 లక్షలకు పైగా) ప్రోత్సాహక బహుమతి కింద ఇవ్వనుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ సొమ్ము ఎంతగానో పనికి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

అయితే..పథకాన్ని ప్రకటిస్తూనే కొన్ని నిబంధనలు కూడా విధించింది. యువతీ యువకులు తొలుత తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాల‌ని.. వయసు 40 ఏళ్లకు మించకుండా, వార్షికాదాయం 5.4 లక్షల కంటే తక్కువగా ఉన్న వారే ఈ పథకానికి అర్హులని తెలిపింది.

Next Story