కాబోయే భర్తతో ఫొటోలు దిగిన చంద‌మామ‌.. పిక్స్ వైర‌ల్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2020 9:07 AM GMT
కాబోయే భర్తతో ఫొటోలు దిగిన చంద‌మామ‌.. పిక్స్ వైర‌ల్‌

చంద‌మామ కాజ‌ల్ త‌న పెళ్లి ప్ర‌క‌ట‌న‌తో అంద‌రికి స‌డెన్ షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. త‌న ప్రియ‌నేస్తం గౌత‌మ్ కిచ్లూతో త్వ‌ర‌లో ఏడడుగులు వేయ‌నున్నాన‌ని కాజ‌ల్ అక్టోబ‌ర్ ఆరంభంలో ప్ర‌క‌టించింది. వీరిద్ద‌రి వివాహాం ఈ నెల 30న జ‌ర‌గ‌నుంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ జంట‌.. వీరికి సంబంధించిన‌ ఫోటోలు కానీ, వీడియోలు గానీ పోస్ట్ చేయ‌లేదు.

ఇక పెళ్లి ద‌గ్గ‌ర ప‌డ‌డంతో కాజ‌ల్ ఇంట పెళ్లి ప‌నులు ప్రారంభం అయ్యాయి. ఇదిలా ఉంటే.. కాజల్ తనకు కాబోయే వాడితో ఇలా ఫోటో దిగింది. కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లుతో కలిసి దసరా సందర్భంగా అభిమానులు కోరుకుంటున్నట్లు అదిరిపోయే ఫోటోల్ని షేర్ చేసారు. ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా.. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం ఫోటోల‌కు ఫోజులిచ్చారు. వీటిని ఆమె త‌న ఇన్‌స్టా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. మా త‌రుపున మీ అంద‌రికీ ద‌స‌రా శుభాకాంక్ష‌లు అని తెలిపారు. ప్ర‌స్తుతం ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మ‌రోవైపు కాజ‌ల్ సోద‌రి నిషా అగ‌ర్వాల్ సైతం కాబోయే బావ‌గారితో దిగిన ఫోటోను షేర్ చేశారు.

గౌతమ్ ఒక వ్యాపారవేత్త.. ఇంటీరియర్ డిజైన్ ... గృహాలంకరణ వస్తూత్పత్తి వ్యాపారంలో అనుభవజ్ఞుడు. దీనికోసం ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ ను రన్ చేస్తున్నాడు. అతను ఫిట్నెస్ ఔత్సాహికుడు కూడా. తరచూ తాను మారథాన్ లతోనూ సుపరిచితుడు. వాటికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటాడు.

Next Story