మాజీ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష

By సుభాష్  Published on  26 Oct 2020 8:49 AM GMT
మాజీ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష

కేంద్ర మాజీ మంత్రి దిలీప్‌కు మూడేళ్లు జైలు శిక్ష పడింది. బొగ్గు కుంభకోణం కేసులో సోమవారం ఢిల్లీ కోర్టు ఈ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 1999లో జార్ఖండ్‌ బొగ్గు బ్లాక్‌ కేటాయింపుల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో దిలీప్‌ రే దోషిగా తేలారు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌తో పాటు నిందితుల వాదనలు విన్న ఢిల్లీ కోర్టు.. ఈ మేరకు తీర్పునిచ్చింది. కాగా, అటల్‌బిహారీ వాజ్‌పేయ్‌ ప్రభుత్వంలో దిలీప్‌రే ఇంధన శాఖ మంత్రిగా పని చేశారు. దిలీప్‌తో పాటు ఈ కుంభకోణంలో సంబంధం ఉన్న ఇద్దరు సీనియర్‌ అధికారులు ప్రదీప్‌ కుమార్‌ బెనర్జీ, నిత్యనంద్‌ గౌతమ్‌, కాస్టాన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ మహేంద్ర కుమార్‌ అగర్వాల్‌లకు సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది.

అయితే బొగ్గు కుంభకోణానికి సంబంధించి శిక్ష విధించడం దేశ చరిత్రలో తొలిసారి. దిలీప్‌రేకు మూడుళ్ల శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా కూడా విధిచించారు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ భరత్‌ పరాశర్‌. దీంతో పాటు క్యాస్టన్‌ టెక్‌కు రూ.60 లక్షలు, క్యాస్టన్‌ మైనింగ్‌ లిమిటెడ్‌కు రూ.10 లక్షల జరిమానా విధించారు.

దీంతోపాటు క్యాస్ట్రన్ టెక్‌కు రూ.60లక్షలు, క్యాస్ట్రన్ మైనింగ్ లిమిటెడ్‌కు మరో 10లక్షల జరిమానాను విధించారు. సొంత ప్రయోజనాల కోసం నిబంధనలను ఉల్లంఘించినట్లు కోర్టు తెలిపింది. జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లోని బ్రహ్మాదిహ బొగ్గు బ్లాక్‌కు 1999లోఎ నిబంధనలకు విరుద్దంగా సీటీఎల్‌కు కేటాయించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. నిబంధనలను ఉల్లంఘించి సీటీఎల్‌కు బొగ్గు మైనింగ్‌ ప్రాంతాన్ని కేటాయించడాన్ని కోర్టు తప్పుబట్టింది.

Next Story
Share it