న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 2 Nov 2020 7:36 PM IST1.కడప రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్
సోమవారం ఉదయం కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు వద్ద టిప్పర్‌ను రెండు కార్లు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి నలుగురు సజీవదహనం కాగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఈ ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఐదుగురు తమిళనాడు ఎర్రచందనం స్మగ్లర్లు మృత్యువాత పడటం వెనుక పరిణామాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2.సరి, బేసి విధానంలో పాఠశాలలు
దేశంలో కరోనా మహమ్మారి వల్ల అన్ని సంస్థలతో పాటు విద్యాసంస్థలు సైతం మూతపడ్డాయి. ప్రస్తుతం కరోనా కాస్త తగ్గుముఖం పడుతుండటంతో విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఏర్పడకుండా పాఠశాలలు, కళాశాలలు తెరుచుకుంటున్నాయి. అన్‌లాక్ 5.0లో భాగగా దాదాపు ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇక అసోంలో సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3.సుప్రీం కోర్టులో కమల్‌నాథ్‌కు ఊరట
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు ఈసీకి ఎలాంటి అధికారం లేదంటూ సీజేఐ ఎస్ ఏ బాబ్డే అన్నారు. కమల్ నాథ్ స్టార్ క్యాంపెయినర్‌ను రద్దు చేస్తూ శనివారం ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై కమల్‌నాథ్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఎన్నికల కమిషన్ ఆదేశాలపై స్టే విధించింది సుప్రీం కోర్టు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4.ఏపీ హైకోర్టు రోస్టర్ విధానంలో కీలక మార్పులు
ఏపీ హైకోర్టు రోస్టర్ విధానంలో కీలక మార్పులు చేశారు. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని హైకో్రటు చఫ్ జస్టిస్ కార్యాలయం వెల్లడించింది. రాజధాని వివాదంపై దాఖలైన కేసులన్నింటినీ ఒక ధర్మాసనానికి అప్పగించారు. అయితే ఈ ధర్మాసనంలో తాజాగా కొన్ని మార్పులు చేశారు.రోస్టర్ విధానంలో చేసిన కీలక మార్పుల్లో భాగంగా రాజధాని కేసులను విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనంలో కూడా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రజాప్రయోజన వ్యాజ్యాలన్నింటినీ జస్టిస్ రాకేష్ కుమార్,.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5.యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా కర్నల్ సంతోష్‌బాబు భార్య
ఇటీవల గల్వాన్ లోయలో భారత్ -చైనా ఘర్షణలో కర్నల్ సంతోష్ బాబు అమరుడైన విషయం తెలిసిందే. అయితే సంతోష్ భార్య సంతోషికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రం అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా నియామకం అయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంతోషి కలెక్టరేట్ కార్యాయానికి చేరుకుంది. మరి కొద్దిసేపట్లో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు. తాజాగా యాదాద్రి జిల్లాకు ట్రైనీ కలెక్టర్‌గా కేటాయించడంతో ఈ రోజు ఆమె విధుల్లో చేరనున్నారు..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6.సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కాజల్ జంట ఫోటోలు
నటి కాజల్ అగర్వాల్ గత శుక్రవారం గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో సన్నిహితుల మధ్య నిరాడంబరంగా కాజల్ వివాహం జరిగింది. పెళ్లి జరిగినప్పటి నుంచి వివాహానికి సంబంధించిన ఫోటోల గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రోజు ఓ రెండు ఫోటోలను కాజల్, ఆమె చెల్లి నిషా అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7.పరిస్థితులను బట్టి వైరస్ రూపాంతరం.. పరిశోధనలలో ఆసక్తికర నిజాలు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. కరోనా కట్టడికి అన్ని దేశాల సైతం ఎన్నో చర్యలు చేపట్టింది. గతంలో తీవ్రంగా ఉన్నా.. ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. అయినా జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని, లేకపోతే మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.కరోనాపై శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. పరిస్థితులను బట్టి వైరస్ రూపాంతరం చెందుతూ వ్యాప్తి చెందుతోందని వెల్లడిస్తున్నారు. వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు భారత్‌తో పాటు అన్ని దేశాలు సైతం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్లు తుది దశకు, మూడు, రెండు దశల్లో మరికొన్ని ట్రయల్స్ కొనసాగుతున్నాయి. మరో వైపు ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందోనన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోయినా..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8.స్వీయ నిర్బంధంలోకి డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తితో సంబంధాలుండటంతో తాను సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు ఆయన ప్రకటించారు. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని నేను కలిసినట్లు గుర్తించాను. అయితే నాకు కరోనా లక్షణాలు లేనప్పటికీ డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలకు అనుగుణంగా స్వీయ నిర్బంధంలో ఉండి ఇంటి నుంచి పని చేస్తా.. అని టెడ్రోస్ ట్వీట్ చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9.తెలంగాణలో కొత్తగా 922 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 922 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి రాష్ట్రంలో 2,40,970 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్య 1,348కి చేరింది. కరోనా నుంచి నిన్న ఒక్క రోజే 1,456 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,21,992కు చేరింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10.కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు వాహనాలు దగ్ధం..నలుగురు సజీవదహనం
కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వల్లూరు మండలం గోటూరు వద్ద టిప్పర్, టాటా సుమో, కారు ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగి నలుగురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మూడు వాహనాలు కూడా పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఎర్రచందనం తరలిస్తున్న సుమోను టిప్పర్, కారు ఢీకొన్నాయి. కాగా, స్మగ్లర్లు తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి