కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వల్లూరు మండలం గోటూరు వద్ద టిప్పర్‌, టాటా సుమో, కారు ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగి నలుగురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మూడు వాహనాలు కూడా పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఎర్రచందనం తరలిస్తున్న సుమోను టిప్పర్, కారు ఢీకొన్నాయి. కాగా, స్మగ్లర్లు తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కడప-తాడిపత్రి రహదారిపై గోటూరు-తోళ్ల గంగన్న పల్లె మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం ఈ రోజు తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సుభాష్

.

Next Story