స్వీయ నిర్బంధంలోకి డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌

By సుభాష్  Published on  2 Nov 2020 5:04 AM GMT
స్వీయ నిర్బంధంలోకి డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తితో సంబంధాలుండటంతో తాను సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు ఆయన ప్రకటించారు. అయితే కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని నేను కలిసినట్లు గుర్తించాను. అయితే నాకు కరోనా లక్షణాలు లేనప్పటికీ డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలకు అనుగుణంగా స్వీయ నిర్బంధంలో ఉండి ఇంటి నుంచి పని చేస్తా.. అని టెడ్రోస్‌ ట్వీట్‌ చేశారు.

కరోనా వ్యాప్తిని తగ్గించుకునేందుకు ఆరోగ్య మార్గదర్శకాలు పాటించడం తప్పనిసరి అని అన్నారు. డబ్ల్యూహెచ్‌వోలో పని చేస్తున్న తన సహచరులకు హాని కలిగించవద్దనే ఉద్దేశంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు చెప్పారు.

కాగా, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల 68 లక్షల మందికి పైగా కోవిడ్‌ బారిన పడ్డారు. ఈ మహమ్మారి బారిన 12 లక్షల మందికిపైగా మృతి చెందారు. దేశంలో గడిచిన 24గంటల్లో 46964 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 81,84083కు చేరుకుంది. ఇక మృతుల సంఖ్య ఇప్పటి వరకు 1,22111కు చేరింది.Next Story