తెలంగాణలో కొత్తగా 922 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  2 Nov 2020 4:13 AM GMT
తెలంగాణలో కొత్తగా 922 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 922 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి రాష్ట్రంలో 2,40,970 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్య 1,348కి చేరింది. కరోనా నుంచి నిన్న ఒక్క రోజే 1,456 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,21,992కు చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 17,630 యాక్టివ్‌ కేసులుండగా, వారిలో 14,717 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, నిన్న ఒక్క రోజు అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 256 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story