న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
November 26th top 10 News .. 'నిరవ్' తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఏపీలో కూడా ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది.
By సుభాష్ Published on 26 Nov 2020 5:49 PM IST1. 'నిరవ్' తుఫాను ఎఫెక్ట్: ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
'నిరవ్' తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఏపీలో కూడా ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. నివర్ తుఫాను రాగల ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండం, ఆ తర్వాత ఆరు గంటల్లో వాయుగుండం బలహీనపడనుందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. తుఫాను ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో విస్తారంగా భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనిప పేర్కొంది. తుఫాను ప్రభావి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం
తెలంగాణలో కరోనా పరీక్షల తీరు సరిగా లేదని హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ప్రతి రోజు 50 వేల పరీక్షలు చేయాలన్న ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే అమలు చేయడం లేదని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. కరోనాకు సంబంధించి దాఖలైన వాజ్యాలపై గురువారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేసింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ముంబై ఉగ్రదాడిపై స్పందించిన రతన్ టాటా.. ఘటనను గుర్తు చేసుకుని భావోద్వేగం
2008, నవంబర్ 26న ముంబైలో ఉగ్రవాదుల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మరణహోమానికి నేటితో 12 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌టాటా ఆ దుర్ఘటనపై ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. తాజ్‌మహల్‌ప్యాలెస్‌హోటల్ ఫోటోను పోస్టు చేసి ఆ విధ్వంసాన్ని మర్చిపోలేమని అన్నారు. వందేళ్ల కిందట నాటి తాజ్‌మహల్ హోటల్‌పై 12 ఏళ్ల కిందట ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ హోట్ ఓనర్ టాటా గ్రూపే. అయితే ఉగ్రవాదాన్ని ఓడించేందుకు ముంబై ప్రజలు చూపిన తెగువను, సాహసాన్ని రతన్ టాటా ప్రశంసించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. Fact Check : రోహింగ్యాలను ఓటర్ లిస్టులో చోటు కల్పించాలని కేంద్రాన్ని ఎంఐఎం పార్టీ కోరిందా..?
కొద్దిరోజుల కిందట తెలంగాణ బీజేపీ ఓ ట్వీట్ ను పోస్టు చేసింది. "అక్రమ చొరబాటుదారులకు @trspartyonline @aimim_national కలిసి మద్దతిస్తున్నాయి. అక్రమ చొరబాటుదారులు ఓటర్ లిస్టుల్లో కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రోహింగ్యాలను ఓటర్ లిస్టులో చేర్చమని ఎంఐఎం కేంద్రానికి లేఖ కూడా రాసింది. - @smritiirani డిటైల్స్" అన్నది ఆ ట్వీట్ సారాంశం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఈ హీరోని గుర్తుపట్టారా..?
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్ నటిస్తోన్న చిత్రం బాబ్ బిస్వాస్. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని అభిషేక్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఫుల్ స్లీవ్ షర్ట్, పెద్ద కళ్లజోడు, సరికొత్త హెయిర్ స్టైల్ తో అభిషేక్ కనిపిస్తున్నాడు. కాంట్రాక్ట్ కిల్లర్.. బాబ్ బిస్వాస్ పాత్రలో అభిషేక్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ కోల్‌కత్తాలో ఇటీవల తిరిగి ప్రారంభమైంది. అభిషేక్ సరసన . చిత్రాంగద సింగ్ నటిస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. గ్రేటర్ ఎన్నికలు: బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ దూకుడు పెంచింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అగ్రనేతలు హైదరాబాద్‌కు చేరుకుని ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. తాజాగా గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ కార్యాలయంలో గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావానికి సుదీర్ఘ పోరాటం జరిగిందని.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7హైదరాబాద్‌లో ఆ ఐదు థియేటర్స్ శాశ్వతంగా మూతపడనున్నాయా..?
కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని తీవ్రంగా దెబ్బకొట్టింది. ఈ వైరస్ కారణంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 9 నెలలుగా థియేటర్స్ మూతపడి ఉన్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు అలవాటు పడ్డారు. కాగా.. కోవిడ్ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకొని సినిమా థియేటర్లను ఓపెన్ చేయడానికి ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో క్లోజ్ అయిన సినిమా థియేటర్లు 50శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో తిరిగి ప్రారంభించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్లను ప్రారంభించేందుకు థియేటర్ల నిర్వాహకులు సమాయత్తం అవుతున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. కరోనా ఎఫెక్ట్: కేంద్రం కీలక నిర్ణయం.. డిసెంబర్ 31 వరకు రద్దు
దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే పరిస్థితులను బట్టి విమానాలు నడపనున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉరువారం వెల్లడించింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. 22 సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్న గంగూలీ
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నాలుగున్నర నెలల కాలంలో 22 సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపాడు. కాగా.. 22 సార్లు నిర్వహించిన పరీక్షల్లో తనకు ఒక్కసారి కూడా పాజిటివ్ రాలేదన్నాడు. ఐపీఎల్ 2020 సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ ఫస్ట్ వీక్ వరకు యూఏఈలో దాదా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ ప్రొటోకాల్స్ మేరకు గంగూలీ అందరిలానే కరోనా పరీక్షలు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో సిడ్నీలో అడుగుపెట్టిన దాదా.. మంగళవారంతో తన క్వారంటైన్ పిరీయడ్‌ను పూర్తి చేసుకున్నాడు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా ఇక లేరు..
అర్జెంటీనా పుట్‌బాల్ దిగ్గజం, సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా కన్నుమూశారు. గుండెపోటుతో బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మారడోనా.. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్నారు. నవంబర్ 12న కోలుకొని ఇంటికి కూడా చేరుకున్నాడు. అయితే రెండు వారాల వ్యవధిలోనే తుది శ్వాస విడిచాడు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి