ముంబై ఉగ్రదాడిపై స్పందించిన రతన్‌ టాటా.. ఘటనను గుర్తు చేసుకుని భావోద్వేగం

Ratan tata twitt mumbai terror attack.. 2008, నవంబర్‌ 26న ముంబైలో ఉగ్రవాదుల దాడి చేసిన విషయం తెలిసిందే.

By సుభాష్
Published on : 26 Nov 2020 3:28 PM IST

ముంబై ఉగ్రదాడిపై స్పందించిన రతన్‌ టాటా.. ఘటనను గుర్తు చేసుకుని భావోద్వేగం

2008, నవంబర్‌ 26న ముంబైలో ఉగ్రవాదుల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మరణహోమానికి నేటితో 12 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌టాటా ఆ దుర్ఘటనపై ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. తాజ్‌మహల్‌ప్యాలెస్‌హోటల్‌ ఫోటోను పోస్టు చేసి ఆ విధ్వంసాన్ని మర్చిపోలేమని అన్నారు. వందేళ్ల కిందట నాటి తాజ్‌మహల్‌ హోటల్‌పై 12 ఏళ్ల కిందట ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ హోట్‌ ఓనర్‌ టాటా గ్రూపే. అయితే ఉగ్రవాదాన్ని ఓడించేందుకు ముంబై ప్రజలు చూపిన తెగువను, సాహసాన్ని రతన్‌ టాటా ప్రశంసించారు.

ముంబై ప్రజలు ఆ రోజు ప్రదర్శించిన సున్నితత్వం భవిష్యత్తులోనూ ప్రజ్వరిల్లుతుందని చెప్పుకొచ్చారు. ఉగ్రదాడి జరిగి కొన్ని నెలల తర్వాత ఆ హోటల్‌ను మరమ్మతులు చేశారు. ఆ రోజు జరిగిన దాడిలో ఆ హోటల్‌లోనే 31 మంది మరణించారు. అయితే ముంబైలో జరిగిన ఈ ఉగ్రదాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక తన ట్వీట్‌లో.. 26/11 మారణ హోమం జరిగి 12 ఏళ్ల గడిచాయి. అయినా ఇప్పటికీ గుర్తుంచుకున్నాం. ఎప్పటికీ మర్చిపోలేం అని పేర్కొన్నారు. ప్రజల్లో ఉన్న ఐక్యత, దయను మెచ్చుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా వీటిని కొనసాగిస్తారని ఆశిస్తున్నాం..అంటూ ట్వీట్‌ చేశారు.

Next Story