తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం

High court angry over Telangana government.. తెలంగాణలో కరోనా పరీక్షల తీరు సరిగా లేదని హైకోర్టు తీవ్రంగా మండిపడింది.

By సుభాష్  Published on  26 Nov 2020 10:51 AM GMT
తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణలో కరోనా పరీక్షల తీరు సరిగా లేదని హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ప్రతి రోజు 50 వేల పరీక్షలు చేయాలన్న ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే అమలు చేయడం లేదని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. కరోనాకు సంబంధించి దాఖలైన వాజ్యాలపై గురువారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేసింది.

అయితే అవసరమైనప్పుడు రోజుకు 50 వేల పరీక్షలు చేస్తామని నివేదికలో పేర్కొనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్త చేసింది. అధికంగా ఫిర్యాదులు వచ్చే ప్రైవేటు ఆస్పత్రులపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలేమో కానీ.. ఎన్నికలు పూర్తయ్యాక కరోనా రెండో దశ ఫలితాలు మాత్రం వస్తాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇదే జరిగితే కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఏమి కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌రావుకు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది.

Next Story