దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే పరిస్థితులను బట్టి విమానాలు నడపనున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉరువారం వెల్లడించింది.
కాగా, కోవిడ్‌కు సంబంధించి ప్రయాణ, వీసా పరిమితులు పేరుతో తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్26న విడుదల చేసిన ఉత్తర్వులకు మార్పులు చేస్తున్నామని, అన్ని అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల విమానాలను డిసెంబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమానాల్లో కార్గో విమానాలకు ఈ నిబంధనలు విర్తించవు.