గ్రేటర్‌ ఎన్నికలు: బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

GHMC Election BJP Manifesto.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా బీజేపీ దూకుడు పెంచింది. ఢిల్లీ నుంచి గల్లీ

By సుభాష్  Published on  26 Nov 2020 8:43 AM GMT
గ్రేటర్‌ ఎన్నికలు: బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా బీజేపీ దూకుడు పెంచింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అగ్రనేతలు హైదరాబాద్‌కు చేరుకుని ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. తాజాగా గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ కార్యాలయంలో గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫడ్నవిస్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావానికి సుదీర్ఘ పోరాటం జరిగిందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుదీర్ఘ పోరాటం జరిగిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించామన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర చాలా ఉందని, ప్రజలకు ఏం కావాలో బీజేపీ తెలుసన్నారు. భారత రాజ్యాంగాన్ని మోదీ సర్కార్‌ కాపాడుతోందని అన్నారు.

బీజేపీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివే..

- ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తాం

- వరదల్లో నష్టపోయిన వారికి రూ.25 వేల సాయం

- కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తాం

- గ్రేటర్‌లో గెలిపస్తే సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహిస్తాం

- పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో మహిళలకు ఉచిత ప్రయాణం

- ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ కోసం హైక్వాలిటీ వైఫై సౌకర్యం

- లక్ష మంది పేదలకు ప్రధాని ఆవాజ్‌ యోజన కింద నివాస గృహాలు

- 10వేల కోట్లతో మూసీ ప్రక్షాళన

- హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో బాగు చేస్తాం

- అక్రమ నిర్మాణాలను కూల్చివేయిస్తాం

- హైదరాబాద్‌లో నాలాల పునరుద్దరణ

- ఎస్సీ కాలనీలు, బస్తీ వాసులకు ఆస్తి పన్ను రద్దు

- 125గజాలలోపు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు అవసరం లేదు

Next Story