22 సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్న గంగూలీ
Have undergone 22 COVID tests in past four and half months. టీమ్ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
By Medi Samrat Published on 26 Nov 2020 12:11 PM IST
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నాలుగున్నర నెలల కాలంలో 22 సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపాడు. కాగా.. 22 సార్లు నిర్వహించిన పరీక్షల్లో తనకు ఒక్కసారి కూడా పాజిటివ్ రాలేదన్నాడు. ఐపీఎల్ 2020 సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ ఫస్ట్ వీక్ వరకు యూఏఈలో దాదా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ ప్రొటోకాల్స్ మేరకు గంగూలీ అందరిలానే కరోనా పరీక్షలు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో సిడ్నీలో అడుగుపెట్టిన దాదా.. మంగళవారంతో తన క్వారంటైన్ పిరీయడ్‌ను పూర్తి చేసుకున్నాడు.
ఆస్ట్రేలియాలో కరోనా నిబంధనలు చాలా కఠినంగా అమలు చేస్తున్నారని, అందుకే అక్కడ కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 27న సిడ్నీ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా జట్టుతో తొలి వన్డే మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు సిద్ధంగా ఉందని ప్రకటించాడు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారని, అద్భుతంగా రాణిస్తారన్న ధీమాను వ్యక్తం చేశాడు.
'నేను మా వృద్ధ తల్లిదండ్రులతో ఉంటాను. నేను దుబాయికి వెళ్లి వచ్చే క్రమంలో ఆరంభంలో ఆందోళన చెందా. నా కోసం మాత్రమే కాకుండా.. కమ్యూనిటీ, ప్రజలు గురించి తీవ్రంగా ఆలోచించా. వైరస్‌ను మరొకరికి వ్యాప్తి చేయాలనుకో లేదు' అని తెలిపాడు. ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పాడు. ఐపీఎల్ 2021 సీజన్‌ను స్వదేశంలోనే టోర్నీ నిర్వహిస్తామని గంగూలి చెప్పాడు.