ఈ హీరోని గుర్తుప‌ట్టారా..?

Abhishek Bachchan photo viral .. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ వార‌సుడు అభిషేక్ బ‌చ్చ‌న్ నటిస్తోన్న చిత్రం బాబ్ బిస్వాస్.

By సుభాష్  Published on  26 Nov 2020 8:54 AM GMT
ఈ హీరోని గుర్తుప‌ట్టారా..?

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ వార‌సుడు అభిషేక్ బ‌చ్చ‌న్ నటిస్తోన్న చిత్రం బాబ్ బిస్వాస్. థ్రిల్లర్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలోని అభిషేక్ లుక్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇందులో ఫుల్‌ స్లీవ్‌ షర్ట్, పెద్ద కళ్లజోడు, సరికొత్త హెయిర్ స్టైల్ తో అభిషేక్ క‌నిపిస్తున్నాడు. కాంట్రాక్ట్‌ కిల్లర్‌.. బాబ్‌ బిస్వాస్‌ పాత్రలో అభిషేక్‌ ఈ సినిమాలో నటిస్తున్నాడు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ కోల్‌క‌త్తాలో ఇటీవ‌ల తిరిగి ప్రారంభ‌మైంది. అభిషేక్‌ సరసన . చిత్రాంగద సింగ్ నటిస్తోంది.

షారక్‌ ఖాన్‌ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారా దర్శకుడు సుజోయ్‌ ఘోష్ కుమార్తె డియా అన్నపూర్ణ ఘోష్ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోలను చిత్ర బృందం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. గుర్తు పట్టలేని విధంగా అభిషేక్ ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి

Next Story
Share it