హైదరాబాద్‌లో ఆ ఐదు థియేటర్స్ శాశ్వతంగా మూత‌ప‌డ‌నున్నాయా..?

Five Movie theater closed .. క‌రోనా మ‌హ‌మ్మారి సినీ ఇండ‌స్ట్రీని తీవ్రంగా దెబ్బ‌కొట్టింది. ఈ వైర‌స్ కార‌ణంగా చ‌రిత్ర

By సుభాష్  Published on  26 Nov 2020 12:59 PM IST
హైదరాబాద్‌లో ఆ ఐదు థియేటర్స్ శాశ్వతంగా మూత‌ప‌డ‌నున్నాయా..?

క‌రోనా మ‌హ‌మ్మారి సినీ ఇండ‌స్ట్రీని తీవ్రంగా దెబ్బ‌కొట్టింది. ఈ వైర‌స్ కార‌ణంగా చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా దాదాపు 9 నెల‌లుగా థియేట‌ర్స్ మూత‌ప‌డి ఉన్నాయి. దీంతో ప్రేక్ష‌కులు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు అల‌వాటు ప‌డ్డారు. కాగా.. కోవిడ్ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకొని సినిమా థియేటర్లను ఓపెన్ చేయడానికి ఇటీవ‌ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో క్లోజ్ అయిన సినిమా థియేటర్లు 50శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో తిరిగి ప్రారంభించడానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనుమతి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో థియేట‌ర్ల‌ను ప్రారంభించేందుకు థియేట‌ర్ల నిర్వాహ‌కులు స‌మాయ‌త్తం అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో మంచి గుర్తింపు పొందిన ఐదు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయని వార్తలు వస్తున్నాయి. గెలాక్సీ థియేటర్(టోలిచౌకి), శ్రీ రామ థియేటర్(బహదూర్ పుర), అంబ థియేటర్(మెహదీపట్నం), శ్రీ మయూరి థియేటర్(ఆర్టీసీ క్రాస్ రోడ్), శాంతి థియేటర్(నారాయణగూడ) మూతపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మల్టీప్లెక్స్ ల నుంచి పోటీ ఉన్న సమయంలో కూడా ఈ ఐదు థియేటర్లలో సినిమాలను విడుదల చేస్తూ సినీ అభిమానులకు వినోదాన్ని అందిస్తూ వచ్చారు. శాంతి థియేటర్‌ను గోడౌన్‌గా మార్చనున్నారు. అంబ థియేటర్‌కు కొన్ని పర్మిషన్స్ పెండింగ్‌లో ఉన్నాయి కానీ క్లోజ్ చేయడం దాదాపు ఖరారు అయినట్లే. కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటం వల్ల ఆదాయం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story