న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  7 Nov 2020 9:14 PM IST
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1.కమ‌ల్‌హాస‌న్ బ‌ర్త్ డే.. టీజ‌ర్ అదిరింది

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న లేటెస్ట్ మూవీ టైటిల్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇది ఆయ‌న 232వ సినిమా. ఈ చిత్రానికి విక్ర‌మ్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ క‌మ‌ల్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్ధ నిర్మిస్తోంది. 2.22 నిమిషాల నిడివితో కూడిన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.బిగ్‌బాస్‌ -4కు కమల్‌ హాసన్‌

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ -4కు శనివారం రాత్రి కమల్‌ హాసన్‌ రానున్నారు. నవంబర్‌ 7న కమల్‌ హాసన్‌ 66వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనను తెలుగు షోకు ముఖ్యఅతిథిగా తీసుకొచ్చారు. తెలుగుతో పాటు రెండు భాషల్లో బిగ్‌బాస్‌ మొదలైంది. తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ నాని, తర్వాత రెండు సీజన్లు కింగ్‌ నాగార్జున హోస్టుగా వచ్చారు. కానీ తమిళనాట మాత్రం అలా కాదు. మొదటి నుంచి కమల్‌ హాసన్‌ ఒక్కరే ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.భారీ భూకంపం.. తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.2 నమోదు

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. శనివారం ఉదయం సంభవించిన ఈ భూకంపంతో జపాన్‌ తీరం వణికిపోయింది. జపాన్‌లోని చిచిజిమా సమీపంలో దీవిలో ఈ భూకంపం సంభవించింది. జపాన్‌ రాజధాని టోక్యోకు 600 మైళ్ల దూరంలో ఉన్న ఒగాసవరా ద్వీపసమూహంలో ఈ భూకంపం వచ్చినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.2గా నమోదైందని జపాన్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ భూకంపం కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.Fact Check : చంకలో బిడ్డను పెట్టుకుని రోళ్లను అమ్మిన మహిళ.. సి.ఐ. అయిందా..!

ఓ మహిళ తల మీద రోళ్లు పెట్టుకుని, చంకలో బిడ్డను పెట్టుకుని ఉన్న ఫోటో.. మరో వైపు పోలీసు డ్రెస్ లో ఉన్న ఫోటో. ఈ రెండు ఫోటోల్లో ఉన్నది ఒక్కరే అన్న ప్రచారం జరుగుతోంది. చంకలో బిడ్డను పెట్టుకుని.. రోళ్లను అమ్ముతూ బ్రతికిన అమ్మాయి.. బాగా చదివి ఎస్.ఐ. అయిందంటూ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆమె మహిళా పోలీసు అయిందంటూ పలువురు షేర్ చేస్తూ ఉన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.సైనిక పాఠశాలల్లోకి ప్రవేశాల కొర‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిది తరగతుల్లోకి ప్రవేశాల కోసం, అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష-2021 (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)ని వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన (ఆదివారం) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లోకి ఏఐఎస్‌ఎస్‌ఈఈ ద్వారా ప్రవేశాలు ఉంటాయి. గత నెల 20వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 19వ తేదీతో ముగుస్తుంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌

తిరుమల భక్తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది టీటీడీ. సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే కేంద్రాలను పెంచుతున్నట్లు తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేవారు. తాజాగా విష్ణు నివాసం వసతి గృహంలోనూ టికెట్ల జారీని ప్రారంభించారు. బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌కు వచ్చే యాత్రికుల కోసం విష్ణు నివాసంలో టోకెన్లను జారీ చేస్తున్నారు. భక్తుల రద్దీ, కరోనా నేపథ్యంలో సర్వదర్శనం సమయం స్లాట్‌ టోకెన్ల సెంటర్లను పెంచింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.8 ఏళ్లు చాలా ఎక్కువ‌.. కోహ్లీని త‌ప్పించాల్సిందే : గ‌ంభీర్‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)లో రాయ‌ల్ ఛాలెంజ‌ల్స్ బెంగ‌ళూరు క‌థ ముగిసిన సంగ‌తి తెలిసిందే. ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ఆ జ‌ట్టు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ చేతిలో 6 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. దీంతో ఈ సారైనా క‌ప్పు సాధించాలన్న‌ ఆశ‌ను నెర‌వేర్చుకోకుండా ఆ జ‌ట్టు ఇంటి ముఖం ప‌ట్టింది. దీంతో కెప్టెన్ కోహ్లీపై విమ‌ర్శ‌లు మొద‌లైయ్యాయి. కెప్టెన్‌గా కోహ్లీని తొల‌గించాని కొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్యాఖ్యానిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనికి మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ మ‌ద్ద‌తు ప‌లికాడు. ఇప్ప‌టికే చాలా ఆల‌స్యమైంద‌ని.. ఇప్ప‌టికైనా కెప్టెన్‌గా కోహ్లీని త‌ప్పించాల‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.దుబ్బాక: ఇద్దరు కుమార్తెల గొంతు కోసిన తండ్రి.. రక్షించిన కానిస్టేబుళ్లు

దుబ్బాక మండలం చిట్టాపూర్‌ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కుమార్తెల పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఇద్దరు కుమార్తెల గొంతు కోశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి పిల్లల ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఎండీ మహమ్మద్‌ 15 సంవత్సరాల కిందట మిర్‌దోడ్డి మండలంలోని మోతే గ్రామానికి వలస వచ్చిడు. అయితే మోతే గ్రామంలో మాంసం విక్రయం కొనసాగిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం దుబ్బాక మండలం చిట్టాపూర్‌ గ్రామానికి చెందిన గుంజేడు సాయిలు ఇంట్లో మహమ్మద్‌ అద్దెకు దిగాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.మహేష్‌ బాబు మరో రికార్డు..!

హీరో మహేష్‌ బాబు.. ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో ఎవరికి సాధ్యం కానంతగా దూసుకెళ్లి హ్యాట్రిక్‌ కూడా కొట్టేశాడు. సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు ఏకంగా 130 కోట్ల షేర్‌ వసూలు చేసింది. ఇది మహేష్‌ కెరీర్‌లోలోనే బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం కంటే ముందు గత ఏడాది మహర్షితో కూడా వంద కోట్ల మార్క్‌ అందుకున్నాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.ట్రంప్‌పై 40ల‌క్ష‌ల ఓట్ల తేడాతో గెలుస్తాం : జో బైడెన్‌

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. అగ్ర‌రాజ్య అధ్య‌క్ష పీఠం ఎవ‌రిద‌న్న దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాన‌ప్ప‌టికి జో బైడెన్ అత్య‌ధిక ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌తో అధికారానికి అవ‌స‌ర‌మైన మ్యాజిక్ ఫిగ‌ర్‌కు అత్యంత చేరువ‌లో నిలిచారు. కీల‌క రాష్ట్ర‌మైన జార్జియా, నెవ‌డాలోనూ డెమొక్రాటిక్ నేత అధిక్యంలో కొన‌సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న‌దే విజ‌యం అని జో బైడెన్ చెప్తున్నాడు. అంతేకాదు ట్రంప్‌పై 40ల‌క్ష‌ల ఓట్ల తేడాతో గెలుస్తున్నామ‌ని చెప్పారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story