కమ‌ల్‌హాస‌న్ బ‌ర్త్ డే.. టీజ‌ర్ అదిరింది

By సుభాష్  Published on  7 Nov 2020 3:22 PM GMT
కమ‌ల్‌హాస‌న్ బ‌ర్త్ డే.. టీజ‌ర్ అదిరింది

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న లేటెస్ట్ మూవీ టైటిల్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇది ఆయ‌న 232వ సినిమా. ఈ చిత్రానికి విక్ర‌మ్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ క‌మ‌ల్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్ధ నిర్మిస్తోంది. 2.22 నిమిషాల నిడివితో కూడిన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. గతంలో ఎన్నడూ పోషించని విలక్షణ పాత్రలో కమల్ కనిపించనున్నారని తెలుస్తోంది. తన ఇంట్లో ఆయుధాలను దాస్తూ కమల్ కనిపిస్తుండటం సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది.

ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు 2 చిత్రంలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డింది. కాజ‌ల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. న‌వంబ‌ర్ చివ‌రిలో ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.

Next Story