మహేష్‌ బాబు మరో రికార్డు..!

By సుభాష్  Published on  7 Nov 2020 11:46 AM GMT
మహేష్‌ బాబు మరో రికార్డు..!

హీరో మహేష్‌ బాబు.. ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో ఎవరికి సాధ్యం కానంతగా దూసుకెళ్లి హ్యాట్రిక్‌ కూడా కొట్టేశాడు. సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు ఏకంగా 130 కోట్ల షేర్‌ వసూలు చేసింది. ఇది మహేష్‌ కెరీర్‌లోలోనే బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం కంటే ముందు గత ఏడాది మహర్షితో కూడా వంద కోట్ల మార్క్‌ అందుకున్నాడు. ఇక కొరటాల తెరకెక్కించిన భరత్‌ అనే నేను సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇలా మూడు విజయాలు మహేష్‌ ఖాతాలో పడ్డాయి.

ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు మహేష్‌ బాబు. గీత గోవిందం తర్వాత రెండేళ్లకు పైగా సమయం తీసుకుని మహేష్‌ బాబు కోసమే ఈ కథ సిద్ధం చేశాడు పరుశురామ్‌. దాంతో ఆయన కూడా ఫిదా అయ్యాడు. బ్యాంక్‌ మోసాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఇందులో హీరో తండ్రి బ్యాంక్‌ ఉద్యోగిగా పని చేస్తుంటాడని, ఆయనను కొందరు మోసగాళ్లు కొన్నివేల కోట్లు కొట్టేస్తారు. కొందరు వాళ్లను పట్టుకుని పోయిన డబ్బును ఎలా తిరిగి సంపాదిస్తారనేది ఈ సినిమా స్టోరీ. ఆర్థిక నేరాల చుట్టూనే ఈ కథ అల్లుకుంటున్నాడు డైరెక్టర్‌ పరుశురామ్‌.

ఇదిలా ఉంటే ఈ సినిమా బిజినెస్‌ కూడా ఓ రేంజ్‌లో జరుగుతుంది. ఇంకా షూటింగ్‌ కూడా మొదలు కాకముందే బిజినెస్‌ పూర్తయిపోతుంది. మహేష్ ప్రస్తుతం ఉన్న క్రేజ్‌ను బట్టి చూస్తుంటే ఈ సినిమా రూ.120 కోట్లకు పైనే జరుగుతుందని తెలుస్తోంది. అయితే షూటింగ్‌ పూర్తకాక ముందే బిజినెస్‌ పూర్తి చేయడం మామూలు విషయం కాదు. అయితే దర్శకుడిపై పూర్తి నమ్మకం ఉండటంతో ముందుగానే నిర్మాతలు కూడా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ తో పాటు మహేష్‌ బాబు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.

Next Story