బిగ్‌బాస్‌ -4కు కమల్‌ హాసన్‌

By సుభాష్  Published on  7 Nov 2020 3:14 PM GMT
బిగ్‌బాస్‌ -4కు కమల్‌ హాసన్‌

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ -4కు శనివారం రాత్రి కమల్‌ హాసన్‌ రానున్నారు. నవంబర్‌ 7న కమల్‌ హాసన్‌ 66వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనను తెలుగు షోకు ముఖ్యఅతిథిగా తీసుకొచ్చారు. తెలుగుతో పాటు రెండు భాషల్లో బిగ్‌బాస్‌ మొదలైంది. తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ నాని, తర్వాత రెండు సీజన్లు కింగ్‌ నాగార్జున హోస్టుగా వచ్చారు. కానీ తమిళనాట మాత్రం అలా కాదు. మొదటి నుంచి కమల్‌ హాసన్‌ ఒక్కరే ఉన్నారు. ఆ షోకు రేటింగ్స్‌ కూడా బాగానే ఉంది. ఈ రోజు కమల్‌ పుట్టిన రోజు సందర్భంగా వర్చువల్‌ స్టూడియోలో తెలుగు షోకు కమల్‌ను తీసుకొచ్చారు. వీకెండ్‌ ఎపిసోడ్‌లో ఇదే హైలైట్‌ కాబోతోంది.

కంటెస్టెంట్లను చూసిన కమల్‌ కూడా ఫిదా అయిపోయారు. తెలుగు బిగ్‌బాస్‌ షోకు రావడం ఇదే తొలిసారి కాదు. రెండో సీజన్‌లో కూడా కమల్‌ నేరుగా వచ్చారు. అప్పుడు ఆయన నటించిన విశ్వరూపం 2 మూవీ ప్రమోషన్లలో భాగంగా వచ్చాడు. ఇప్పుడు ఇద్దరూ ఇరు భాషల కంటెస్టెంట్లను పలకరించారు. నాగార్జునను చూసి తమిళ కంటెస్టెంట్లు ఫిదా అయిపోయారు. ఇదిలా ఉండగా, కమల్‌ పరిచయం కూడా నాగార్జున తనదైన శైలిలో చేశాడు.Next Story
Share it