ట్రంప్‌పై 40ల‌క్ష‌ల ఓట్ల తేడాతో గెలుస్తాం : జో బైడెన్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2020 10:16 AM GMT
ట్రంప్‌పై 40ల‌క్ష‌ల ఓట్ల తేడాతో గెలుస్తాం : జో బైడెన్‌

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. అగ్ర‌రాజ్య అధ్య‌క్ష పీఠం ఎవ‌రిద‌న్న దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాన‌ప్ప‌టికి జో బైడెన్ అత్య‌ధిక ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌తో అధికారానికి అవ‌స‌ర‌మైన మ్యాజిక్ ఫిగ‌ర్‌కు అత్యంత చేరువ‌లో నిలిచారు. కీల‌క రాష్ట్ర‌మైన జార్జియా, నెవ‌డాలోనూ డెమొక్రాటిక్ నేత అధిక్యంలో కొన‌సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న‌దే విజ‌యం అని జో బైడెన్ చెప్తున్నాడు. అంతేకాదు ట్రంప్‌పై 40ల‌క్ష‌ల ఓట్ల తేడాతో గెలుస్తున్నామ‌ని చెప్పారు.

అధికారంలోకి వచ్చిన తొలిరోజే కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా కట్టడికి డెమోక్రాట్ ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి వివరిస్తామన్నారు. ప్రతి ఒక్కరి ఓట్లు లెక్కించబడతాయని.. ఎవరూ కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో విద్వేషాన్ని అరికట్టేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు జో బైడెన్ పేర్కొన్నారు. యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహించడమే అధ్యక్షుడిగా తన బాధ్యత అని చెప్పారు. ఇప్పుడు అందరూ కోపతాపాలను పక్కన పెట్టాలని అన్నారు. ఒక దేశంగా ప్రతి ఒక్కరూ ఒకటి కావాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు.

Also Read

Next Story