న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

December 6th Top 10 News I న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  6 Dec 2020 7:21 PM IST
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1కొత్త పార్లమెంటు.. 2022 కల్లా రెడీ అవుతుందా..?

ఈ నెల 10న కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొత్త పార్లమెంటు భవనం త్రిభుజాకారంలో ఉండబోతోంది. ప్రస్తుత పార్లమెంటు భవనం పక్కనే దీన్ని నిర్మించనున్నారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ భవనాన్ని నిర్మించబోతోంది. రూ. 861.90 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనాన్ని బ్రిటీష్ హయాంలో నిర్మించారు. ఎడ్విన్ లూట్యెన్స్, హర్బర్ట్ బేకర్ ల పర్యవేక్షణలో దీని నిర్మాణం జరిగింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భారత భూభాగంలో చైనా గ్రామాలు

భారత్ తో మేము శాంతి మాత్రమే కోరుకుంటూ ఉన్నామని చైనా చెబుతూ వస్తోంది. కానీ సరిహద్దుల్లో చేసే పనులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమైనా.. తమదేనని చైనా చాలా ఏళ్లుగా చెబుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో ఏకంగా మూడు గ్రామాలనే ఏర్పాటు చేసింది. 3,222 మందిని వలంటరీ బేసిస్‌పై ఈ గ్రామాలకు తరలించింది చైనా. భారత్‌, చైనా, భూటాన్ దేశాల జంక్ష‌న్‌లో అరుణాచ‌ల్ ప్రదేశ్‌కు ప‌శ్చిమాన ఉన్న బ‌మ్ లా పాస్‌కు 5 కిలోమీట‌ర్ల దూరంలోనే ఈ గ్రామాల ను నిర్మించింది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విజయశాంతి బీజేపీలో చేరడానికి ముహూర్తం రేపే..

కాంగ్రెస్ పార్టీకి విజయశాంతి దూరమై చాలా రోజులే అవుతోంది. గత కొద్దిరోజులుగా ఆమె బీజేపీలో చేరుతారనే కథనాలు వస్తూ ఉన్నాయి. తాజాగా విజయశాంతి రేపు బీజేపీలో చేరుతున్నారని జాతీయ మీడియా వెల్లడించింది. విజయశాంతి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారని, రేపు కాషాయ కండువా కప్పుకునేందుకు ముహూర్తం కుదిరిందని ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. విజయశాంతి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని తెలిపింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విజయశాంతిని బీజేపీ కార్యాలయానికి తీసుకుని వెళతారనే ప్రచారం కూడా సాగుతోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రెచ్చిపోయిన పాండ్యా.. రెండో టీ20లోనూ టీమిండియాదే విజ‌యం

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఘ‌న‌విజ‌యం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 194 పరుగుల ల‌క్ష్యాన్ని మ‌రో రెండు బంతులు మిగిలుండ‌గానే చేధించింది. తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. రెండో టీ20లో కూడా విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో శిఖర్‌ ధావన్‌(52; 36 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌(30; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి(40; 24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌లు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భార‌త్ బంద్‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వంతో ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపిన‌ప్ప‌టికి.. ఫ‌ల‌వ‌తం కాలేదు. మ‌రోసారి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. అయితే.. చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఈనెల 8 వ తేదీన భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్‌ను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈ చిట్కాలు పాటించండి.. రోగ నిరోధక శక్తి పెంచుకోండి

ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో ఇమ్యూనిటీ పవర్‌ తగ్గిపోతోంది. ముందే కరోనా కాలం. ఇలాంటి పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి పెంచుకుంటే కరోనానే కాకుండా ఇతర వ్యాధులు దరి చేరకుండా కాపాడుకోగలుగుతాము. వైరస్‌కు వ్యాక్సిన్‌ లేకపోవడంతో కనిపించని శత్రువుతో పోరాటం చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టినా.. నిర్లక్ష్యం చేస్తే మరింత విజృంభించే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగ నిరోధక శక్త పెంచుకునే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. శక్తి లేకుంటే వైరస్‌ దాడి చేస్తే తట్టుకునే శక్తి ఉండదు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తేదీ 6-12-2020 నుంచి 12-12-2020 వరకు వార ఫలాలు

ఈ రాశి వారికి ఈ వారం విశేష ధన లాభం ఉంది. అయితే ఈ వారం ప్రారంభంలో కలిగే అనారోగ్యం మిమ్మల్ని కాస్త వెనకబడేలా చేస్తుంది. దీంతోపాటు అకారణ కలహాలు, రాజకీయ చిక్కులు, చోర బాధ మిమ్మల్ని ప్రతి పనిలోనే వెనక్కి లాగుతాయి. అయితే ఈ వారాంతంలో మీకు శుక్రుడు లభిస్తాడు. భూ సంపదని కలుగజేస్తాడు. స్థిరాస్తి విషయంలో మీకు ఉండే కోరికలు నెరవేరుతాయి. ఈవారం మీకు 32 శాతం అనుకూలత ఉంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బిగ్‌బాస్‌ నుంచి అవినాష్‌ ఔట్‌..!

బిగ్‌బాస్‌ రియాలిటీ షో తుది దశకు చేరుకుంది. మొదటి సీజన్‌ నుంచి ఎంతో పాపులారిటీ పొందుతున్న బిగ్‌బాస్‌.. నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో అభిజిత్‌, హారిక, అవినాస్‌, అఖిల్‌, మోనాల్‌లు ఉన్నారు. శనివారం రాత్రి ప్రసారం అయిన షోలో అభిల్‌ సేవ్‌ అయ్యాడు. ఇక మిగిలిన నలుగురు ఎలిమినేషన్‌లో ఉన్నారు. ఇక ఎప్పటిలాగే ప్రతి వారం ఒకరిని హౌస్‌ నుంచి పంపించేయడం జరుగుతున్న తంతు. ఇక ఓటింగ్‌ శాతంలో అభిజిత్‌ అగ్రస్థానంలో ఉండగా, హారిక కూడా సేవ్‌ అయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరోసారి బిగ్‌బాస్‌ దత్తపుత్రిక అయిన మోనాల్‌ ఈ వారం కూడా ఎలిమినేషన్‌ నుంచి సేవ్‌ అయినట్లు తెలుస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌లో అనుమతి కోసం ఫైజర్ ద‌ర‌ఖాస్తు

అమెరికన్ వ్యాక్సిన్ కంపెనీ ఫైజర్ టీకాను విపణిలోకి తీసుకొచ్చేందుకు అన్ని రంగం సిద్ధం చేస్తున్నది. ఇప్ప‌టికే యూకే, బహ్రెయిన్ దేశాలు ఈ టీకాకు అనుమతులు మంజూరు చేశాయి. ఇక‌ ఫైజర్ చూపులు ఇప్పుడు ఇండియాపై ఉన్నాయి. తాము త‌యారు చేసిన కొవిడ్-19 టీకా అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వాల‌ని ఫైజ‌ర్ ఇండియా భార‌త ఔష‌ద నియంత్ర‌ణ జ‌న‌ర‌ల్‌(డీసీజీఐ)ని కోరింది. వాక్సిన్‌ను దిగుమ‌తి చేసుకుని విక్ర‌యించ‌డానికి, పంపిణీకి అనుమ‌తించాల‌ని, భార‌త ప్ర‌జ‌ల‌పై క్లినిక‌ల్ ప‌రీక్షల నిర్వ‌హ‌ణ ఆవ‌శ్య‌క‌త‌ను ప్ర‌త్యేక నిబంధ‌న‌ల కింద ర‌ద్దు చేయాల‌ని దానిలో కోరింది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్‌ చేయండి. లేదంటే నేనే లొంగిపోతాను: తేజస్వీ యాదవ్‌

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్లకు మద్దతుగా పలు రాష్ట్రాల్లోని పార్టీలు సంఘీభావం తెలుపుతూ ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలో రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) రైతులకు మద్దతుగా పోరాటం చేస్తూ ఉంది. శనివారం పట్నాలోని గాంధీ మైదాన్‌లో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించగా.. ఈ కార్యక్రమాన్ని అనుమతి లేదన్నారు పోలీసులు. తేజస్వీ యాదవ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన 18 మంది ముఖ్య నాయకులు, మరో 500 మంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story