తేదీ 6-12-2020 నుంచి 12-12-2020 వరకు వార ఫలాలు

Weekly Rashifalu I తేదీ 6-12-2020 నుంచి 12-12-2020 వరకు వార ఫలాలు

By సుభాష్  Published on  6 Dec 2020 9:18 AM IST
తేదీ 6-12-2020 నుంచి 12-12-2020 వరకు వార ఫలాలు

7-12-2020 ది. సోమవారం. *నాలుగవ సోమవారం*.

11-12-2020 ది. శుక్రవారం *ఏకాదశి*.

12-12-2020 ది. శనివారం *శని త్రయోదశి*. అమావాస్య ముందు కార్తీక మాసం శని త్రయోదశి చాలా పట్టగలిగిన రోజు.

13-12-2020 ది. ఆదివారం *మాస శివరాత్రి.*

14-12-2020 ది. సోమవారం *అయిదవ సోమవారం*.

మేష రాశి:

ఈ రాశి వారికి ఈ వారం విశేష ధన లాభం ఉంది. అయితే ఈ వారం ప్రారంభంలో కలిగే అనారోగ్యం మిమ్మల్ని కాస్త వెనకబడేలా చేస్తుంది. దీంతోపాటు అకారణ కలహాలు, రాజకీయ చిక్కులు, చోర బాధ మిమ్మల్ని ప్రతి పనిలోనే వెనక్కి లాగుతాయి. అయితే ఈ వారాంతంలో మీకు శుక్రుడు లభిస్తాడు. భూ సంపదని కలుగజేస్తాడు. స్థిరాస్తి విషయంలో మీకు ఉండే కోరికలు నెరవేరుతాయి. ఈవారం మీకు 32 శాతం అనుకూలత ఉంది. భగవంతుని ప్రార్థించడం ద్వారా మీరు చేయబోయే కార్యాలకు కలిగే విఘ్నాలను తొలగించుకొని గలరు. అశ్వినీ నక్షత్రం వారికి పరమమిత్ర తార అయ్యింది కాబట్టి కాస్త అనుకూలంగా ఉంటుంది. భరణి నక్షత్రం వారికి మిత్ర తార కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ స్నేహితుల ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కృత్తికా నక్షత్రం వారికి నైధన తార అయింది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

పరిహారం: శివుని ఆరాధన సమస్త సమస్యలకు పరిష్కారం ఇస్తుంది. నవగ్రహ హోమం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి:

ఈ రాశి వారికి కూడా ఈ వారం విశేష ధన లాభం ఉంది. చేసే ప్రతి పనిలోనూ అనుకోకుండా కూడా మీకు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. ఇందుకు కుజ, బుధ,గురులే కారణం. అయితే శుక్రుడు మీకు అపకీర్తిని తెచ్చి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. వారాంతంలో సప్తమ స్థానానికి మారుతున్నప్పటికీ మీకు పెద్దగా లభించే అవకాశం లేదు. అలాగే శని రాహు కేతువులు కూడా మీకు భయాన్ని, అనారోగ్యాన్ని కలిగించేట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో మీరు మానసికంగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే మొన్న అడుగు వేయగలుగుతారు. మీ జీవితం ఆరోగ్యం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. మొత్తానికి మీకు ఈ వారంలో 48 శాతం అనుకూలత వుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కృత్తికా నక్షత్రం వారికి నైధనతార అయ్యింది కాబట్టి అప్రమత్తంగా ఉండటం మంచిది. రోహిణి నక్షత్రం వారికి సాధన తార కాబట్టి ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టినా దిగ్విజయంగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. మృగశిర నక్షత్రం వారికి ప్రత్యక్ తార కావున కొత్త కార్యక్రమాలను ప్రారంభించక పోవటమే మంచిది.

పరిహారం: సర్ప సూక్త పారాయణ చేయించండి. మంచి జరుగుతుంది.

మిధున రాశి:

ఈ రాశి వారు ఏ వారం అంతా ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాలకు వెళ్లడం ద్వారా బంధుమిత్రులతో కలిసి సంతోషంగా ఉంటారు. శత్రువులు మీకు ఎంత ఇబ్బంది పెట్టాలి అనుకున్నప్పటికీ అది మీ వరకు చేరేలోపే మరొక రూపాన్ని తీసుకొని మీకు లాభాన్ని కలుగజేస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల మీకు ధనవ్యయం తప్పేలా లేదు.శత్రువుల కారణంగా మరణ భయం వెంటాడిన అప్పటికీ కనిపించని శక్తి మిమ్మల్ని ముందుకు నడుస్తూనే ఉంటుంది. అయితే మీరు మంచి మార్గం లో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ ఫలిస్తాయి. చెడు మార్గంలో ప్రయాణిస్తూ మంచి జరగాలని కోరుకోవడం వల్ల ఉపయోగం ఏమాత్రమూ లేదు. మీకు ఈ వారం 56% శుభ పరిణామాలు ఉన్నాయ. మృగశిర నక్షత్రం వారికి ప్రత్యక్ తారయింది కాబట్టీ చేసే ప్రతి పనిలో పట్టుదలకు పోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆర్ద్ర నక్షత్రం వారికి క్షేమ తార కావున శాంతి సుఖము గౌరవంతో ఈ వారం మొదలవుతుంది. పునర్వసు మొదటి మూడు పాదాలవారికి విపత్ తార అయ్యింది కావున కలహములకు, అపార్థములకు అవకాశం ఉంది.

పరిహారం: రవికి సూర్యనమస్కారాలు చేయడం మంచిది. యోగ ఈ సాధన ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చు. శనికి జపం చేయించటం ద్వారా దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని పోగొట్టుకోగలుగుతారు.

కర్కాటక రాశి:

ఈ రాశి వారికి ఈ వారం స్త్రీ ద్వారా లాభం కలిగే అవకాశం ఉంది.. శని కేతు లు మీకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేసినప్పటికి, గురు రాహువులు మీకు సౌఖ్యాన్ని ధన లాభాన్ని కలిగిస్తారు. అయితే చంద్రుడు మీ మానసిక ప్రశాంతతను భగ్నం కలిగించే ప్రయత్నం చేస్తాడు. రవి కూడా మీకు అనుకూలతను ఇవ్వడు సరి కదా మీరు అనవసరమైన భయాన్ని కలిగిస్తాడు. అయినప్పటికీ మీకు ఈ వారంలో 48% శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. పునర్వసు నాలుగో పాదం వారికి

విపత్తార అయింది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. పుష్యమి నక్షత్ర జాతకులకు సంపత్ తార అయ్యింది కాబట్టి అన్నిరకాలుగానూ లాభదాయకం. ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రత్రం జన్మతార అయ్యింది కాబట్టి అనారోగ్య హేతువు.

పరిహారం :- శనికి జపం చేయండి రోజు రుద్రుని దర్శనం చేసుకోండి. మంగళవారం నియమాలు హనుమాన్ చాలీసా హనుమ స్తోత్రం గాని పారాయణ చేయండి.

సింహరాశి:

ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఎంత డబ్బు సంపాదించినా అది ఏదో ఒక కారణంతో మీ చేయి దాటి పోతుంది. అంతే కాదు మీరు ఈ వారంలో శత్రువుపై విజయాన్ని సాధించినప్పటికీ అగౌరవం నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఇందుకు ముందుగానే వేరు మానసికంగా దృఢంగా ఉండటం మంచిది. ఒక స్త్రీ ద్వారా మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆరవ ఇంట్లో గురు గ్రహం కారణంగా మీ మనసు పరిపరి విధాల పోతుంది. ద్వారా మాత్రమే మీరు ఈ స్థితి నుండి బయటపడగలరు. అప్పుడు మాత్రమే వీరు స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలరు. మీకు ఈ వారంలో 48% శుభ ఫలితాలు ఉన్నాయి. మఖా నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయ్యింది కాబట్టి కార్యాలన్ని సానుకూలంగా జరిగిపోతాయి. పుబ్బ నక్షత్ర జాతకులకు మిత్ర తార తో ప్రారంభమైంది కాబట్టి సుఖ సంతోషాలతో ఉంటారు. ఉత్తర ఒకటో పాదం వారికి నైధన తార అయింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

పరిహారం:- సూర్య నమస్కారాలు చేయండి యోగ సాధన చేయండి. కుజుడికి జపం చేయించండి అన్ని విధాలా బాగుంటుంది

కన్యారాశి:

ఈ రాశి వారికి ఈ వారం కూడా అత్యంత అనుకూలంగా ఉంది. ఆర్థికంగా పురోగమిస్తున్నారు. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే శత్రువుల వల్ల కొంత మానసిక ప్రశాంతతను కోల్పోతారు. అయితే మీకు శత్రు జయం. చేసే పనులలో మీ ప్రమేయం లేకుండా జరిగే చిన్న చిన్న అవకతవకలు మిమ్మల్ని ఎదుటివారు ఎత్తిచూపేలా చేస్తాయి. కాబట్టి మీరు ప్రతి పనిలో చాలా అప్రమత్తంగా ఉండటం మంచిది. మారుతున్న శుక్రుడు కూడా మీకు ధనలభాన్నే కలిగిస్తున్నాడు. అయితే ఇంట్లోని పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడండి. ఈ రాశివారికి ఈ వారంలో54 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. ఉత్తర నక్షత్రం 2 3 4 పాదాలు వారికి నైధన తార కాబట్టి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. హస్త నక్షత్రం వారికి సాధన తార అయింది కాబట్టి కార్యజయం . చిత్త 1 2 పాదాల వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.

పరిహారం : బుధవారం నియమాలు పాటిస్తూ నానబెట్టిన పెసలు బెల్లం వేసి బుధవారంనాడు ఉదయమే ఆవుకు తినిపించండి.

తులరాశి:

ఈ వారం మీరు సంతోషము సర్వసంపదలు ఆనందాన్ని కలిగిస్తాయి. 17వ తేదీ నుంచి వీరు తాలూకా ఆదాయ వ్యయాల్లో మార్పు వస్తుంది. వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే సౌఖ్యాలను కూడా చక్కగా పొందే అవకాశం ఈ వారంలో వీరికి ఎక్కువగా ఉంది. ఆలోచించిన ప్రతి పని బుధుడు వ్యయ స్థానంలో ఉండడం కుజుడు సప్తమంలో ఉండటం చేత వాటికి ఆటంకం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం కూడా వీరి పైన ఎక్కువగా ఉండటం చేత వీరికి ఉదరరోగం వచ్చే అవకాశం ఉంది. అలాగే గురు ప్రభావం కూడా వీరికి తగ్గింది దానివల్ల హాని. శుక్ర ప్రభావము బావుంది కనక దానివల్ల సంతోషం కలుగుతుంది. శత్రు భావం ఎక్కువగా ఉంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మీరు వ్యవహరించినట్లు అయితే మీకు చాలా వరకు పనులు అనుకూలంగా మారతాయి. ఈ వారంలో 54 శాతం శుభములు చేకూరుస్తూ ఉన్నాయి. చిత్త 3 4 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి ప్రతికూలత ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకు సంపత్ తార అయింది కాబట్టి మంచి ఫలితాలు కలుగుతాయి. విశాఖ1 2 3 పాదాల వారికి మాత్రం జన్మతార అయింది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

వృశ్చిక రాశి:

ఈ రాశి వారిరు ఈ వారం శారీరకంగాను మానసికంగాను సౌఖ్యాన్ని పొందుతారు. ధన లాభం కుటుంబసభ్యుల ఆనందము సంతోషము మిమ్మల్ని చాలా చాలా ఉత్సాహంగా ముందుకు నడిపిస్తాయి. శత్రువు మూలంగా భయం మీకు ఉంటుంది కానీ మీ తెలివితేటలతో మీరు ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. రవి బలం మీకు చాలా తక్కువగా ఉంది. గురుడు మిమ్మల్ని ఒక కంట కనిపెడుతుంటాడు. అంటే మీ గురువు యొక్క దృష్టి మీ పైన ఉంది. వారి సాయంతో మీరు చక్కని కార్యాన్ని సమాజం కోసం చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇటు పైన కూడా సంపాదించుకుంటారు. తొమ్మిదవ ఇంట్లో కుజుడు మీకు శత్రువుని పెంచుతాడు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. పనిలో తొందరపాటు మీకు అలవాటు. ఆ అలవాటు మార్చుకున్నట్లు అయితే లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు పెరుగుతున్నాయి వ్యాపార వ్యవహారాలలో మీకు ఒక మార్గం లభిస్తుంది . మీకు ఈ వారంలో 48% శుభఫలితాలు ఉంటాయి. విశాఖ 4వ పాదం వారికి విపత్తార తో వార ప్రారంభం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనురాధ నక్షత్ర జాతకులకు సంపత్ తార అయింది కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది. జ్యేష్టా నక్షత్ర జాతకులకు జన్మ తార అయింది కాబట్టి ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తత వహించడం మంచిది.

పరిహారం :- మంగళవారం నాడు ఆంజనేయ స్వామి పూజ, సుబ్రహ్మణ్య పూజ చేయండి. వీలైతే సర్ప సూక్త పారాయణ చేయిస్తే మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.

ధను రాశి:

ఈ రాశి వారికి ధన లాభం, కుటుంబసౌఖ్యం, ఆనందము, సుఖ జీవనం ఈ వారం మీకు చాలా వరకూ మంచి ఫలితాలే ఉన్నాయి. అయినా కొంతమంది ఓర్వలేనితనంతో మీకు శత్రు పీడ తప్పదు. స్థానచలనం ఉంది కాబట్టి మీరు కొంచెం వ్యాపారం వ్యవహారం విషయాల్లో పెట్టుబడులను తగ్గించండి. శని ప్రభావం చేత మీకు మీ కుటుంబ సభ్యులతో ఎవరికో ఒకరికి అనారోగ్య సూచన తో పాటు అధిక ధనవ్యయం సూచనలు కూడా ఉన్నాయి. మీకు సంబంధించిన వ్యక్తులు కాకుండా ఇతరులకు మేలు కొరకు ఖర్చుపెట్టి వలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీలో ఉన్న ఉదాసీనత తగ్గించండి. ఎవరో పని చేసి పెడతారులే అనే భావన మీలో చాలా బద్ధకాన్ని కలగజేస్తోంది. రెండవ ఇంట శని ప్రభావం మీపై ఎక్కువగా పడుతోంది. మీ పనులకు మీరే ఆటంకాలు కల్పించి ఉంటారు. మీ నిర్లక్ష్యం వల్ల మీ పనులలో చాలా నష్టపోతున్నారు అది గుర్తించండి. వారాంతాల్లో మీకు ధన లాభం ఉన్నది. ఈ వారంలో మీకు 48% శుభఫలితాలు ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార అయింది పనులన్ని చాలా చక్కగా ఇతరుల సహాయంతో నెరవేరుతాయి. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి సుఖ సౌఖ్యాలతో ఉంటారు. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి నైధన తార అయింది కాబట్టి అప్రమత్తంగా ఉండడం మంచిది.

పరిహారం :- శని స్తోత్ర పారాయణ, సంకష్టహర స్తోత్ర పారాయణ, హరే రామ నామ జపం మీకు చాలా అనుకూలిస్తాయి. మంగళవార నియమం, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.

మకర రాశి:

ఈ రాశి వారికి ఈ వారం అత్యద్భుతంగా ఉంది పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నాలుగు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. రవి కుజ బుధ శుక్రులు మీకు అనుకూలంగా ఉన్నారు. ఆర్థికంగా లాభం పెట్టడమే కాదు కుటుంబ పరంగా కూడా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలా అని మీకు ఇబ్బందులు లేవని కాదు. భగవంతుని అనుగ్రహంతో ఆ విపత్తుల నుండి మీరు సులభంగానే తప్పించుకుంటారు. ఇందుకోసం మీరు కాస్త డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అయినప్పటికీ మీరు పొందే ఆనందం సంతోషం ముందు ఇది చాలా చిన్న విషయమే గుర్తించండి. అన్ని రాశుల కంటే ఎక్కువగా ఈ రాశి వారికి అనగా 64 శాతం శుభ ఫలితాలు ఈ వారం లో ఉన్నాయి. ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు వారికి నైధన తార అయింది కాబట్టే అనుకూలత లేదు. శ్రవణ నక్షత్ర జాతకులకి సాధన తార అయింది కాబట్టి పూర్తి అనుకూలతలు ఉన్నాయి. ధనిష్ట 1 2 పాదాలు వారికి ప్రత్యక్ తార కాబట్టి ప్రతికూలతలు ఎక్కువ.

పరిహారం :- శని జపం చేయించండి హోమ ప్రక్రియ నిర్వర్తించండి. బ్రాహ్మణ భోజనాలు పెట్టండి శనివారం గురువారం ఉపవాస నియమం పాటించండి.

కుంభ రాశి:

ఈ రాశివారికి ఈ వారం కార్యజయం, ధన లాభం ఆనందాన్ని కలిగిస్తుంది. గత వారం లాగే ఈ వారం కూడా ఏ పని మొదలు పెట్టినా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ అది కచ్చితంగా సఫలీకృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధన లాభం కొనసాగుతుంది అలాగే ధాన్య వృద్ధి కూడా ఉంది. కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించ వలసిన అవసరం ఉంది. చేసే పని మీద శ్రద్ధ పెట్టండి. అయినా సరే మీ శ్రమను గుర్తించేవారు తక్కువగా ఉంటారు. ప్రదేశం మార్పు మీకు చికాకు ని అనారోగ్యాన్ని కూడా కలిగిస్తుంది . మీకు ఈ వారంలో 48శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. ధనిష్ట 3 4 పాదాలు వారికి క్షేమతార అయింది కాబట్టి అనుకున్న పనులు కొంతవరకు నెరవేరుతాయి. శతభిషం నక్షత్ర జాతకులకు విపత్ తార అయింది. కాబట్టి చాలా మంచి ఫలితాలు పొందడం కష్టం. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి సంపత్తార అయింది కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది.

పరిహారం :- అమ్మవారిని నమ్ముకోండి సప్తశతి పారాయణ ఖడ్గమాల పారాయణ లలితా సహస్రనామ పారాయణ చేయండి.

మీన రాశి :

ఈ రాశి వారికి ఈ వారం కూడా అనుకున్న కోరికలు నెరవేర తాయి. భూ సంపద, ధన ధాన్య వృద్ధి ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే రవి ప్రభావం చేత కష్టాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. చిన్న పొరపాట్లు మీరు మీ అధికారుల చేత మాట పడేలా చేస్తాయి. ఈ ప్రభావం చేత మీకు భయం తో పాటు నిరాసక్తత, విచారం కూడా కలుగుతుంది.. గురు శుక్రులుమీకు లాభాన్ని భూ సంపదను కలిగించనున్నారు. అలాగే మీకు శని పూర్తి అనుకూలంగా ఉండి విశేష ధనాన్ని ఇస్తాడు. దానికి తోడు రాహువు సంపదలు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. ఈ రెండిటి అనుకూలతలు మీకు వినియోగించుకుంటే కచ్చితమైన లాభాల్ని పొందగలుగుతారు.. మీకు ఈ వారంలో గతవారం కంటే ఎక్కువగా అంటే 56 శాతం మాత్రమే శుభ ఫలితాలు పొందగలుగుతున్నారు. పూర్వాభాద్ర 4వ పాదం వారికి విపత్ తార అయింది కాబట్టీ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు సంపత్ తార అయింది ఆర్థికంగా బాగుంటుంది. రేవతీ నక్షత్ర జాతకులకు జన్మ తార అయింది కాబట్టి అనారోగ్య సూచనలు ఉన్నాయి.


పరిహారం :- కుజునికి జపం చేయించండి. రవికి సూర్య నమస్కారాలు, యోగసాధన మీకు లాభిస్తాయి.

Next Story