CM KCR On Bharath Bundh. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్
By Medi Samrat Published on 6 Dec 2020 8:25 AM GMT
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికి.. ఫలవతం కాలేదు. మరోసారి చర్చలు జరపనున్నారు. అయితే.. చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఈనెల 8 వ తేదీన భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్‌ను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కాగా.. భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు తెలిపారు. తెరాస శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందన్నారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్న నేపథ్యంలో పార్లమెంటులో తాము వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించామని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారత్ బంద్‌ను విజయవంతం చేయడానికి తమ పార్టీ కృష్టి చేస్తుందని.. బంద్‌ను విజయవం చేసి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.