రెచ్చిపోయిన పాండ్యా.. రెండో టీ20లోనూ టీమిండియాదే విజ‌యం

India Beat Australia In Second T20. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా‌తో జరుగుతున్న రెండో టీ20లో

By Medi Samrat  Published on  6 Dec 2020 5:46 PM IST
రెచ్చిపోయిన పాండ్యా.. రెండో టీ20లోనూ టీమిండియాదే విజ‌యం

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఘ‌న‌విజ‌యం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 194 పరుగుల ల‌క్ష్యాన్ని మ‌రో రెండు బంతులు మిగిలుండ‌గానే చేధించింది. తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. రెండో టీ20లో కూడా విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో శిఖర్‌ ధావన్‌(52; 36 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌(30; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి(40; 24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా(42 నాటౌట్‌; 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(12 నాటౌట్‌; 5 బంతుల్లో 1 ఫోర్‌, 1సిక్స్‌) లు రాణించారు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్ ఇన్నింగ్సులో మాథ్యూ వేడ్(58)‌ హాఫ్‌ సెంచరీకి తోడూ స్మిత్(46)‌ కూడా రాణించడంతో టీమిండియాకు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. చివ‌ర్లో రెచ్చిపోయిన పాండ్యా వ‌రుస సిక్స‌ర్ల‌తో భార‌త్‌కు విజ‌యాన్నందించాడు.


Next Story