అమెరికన్ వ్యాక్సిన్ కంపెనీ ఫైజర్ టీకాను విపణిలోకి తీసుకొచ్చేందుకు అన్ని రంగం సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే యూకే, బహ్రెయిన్ దేశాలు ఈ టీకాకు అనుమతులు మంజూరు చేశాయి. ఇక ఫైజర్ చూపులు ఇప్పుడు ఇండియాపై ఉన్నాయి. తాము తయారు చేసిన కొవిడ్-19 టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని ఫైజర్ ఇండియా భారత ఔషద నియంత్రణ జనరల్(డీసీజీఐ)ని కోరింది. వాక్సిన్‌ను దిగుమతి చేసుకుని విక్రయించడానికి, పంపిణీకి అనుమతించాలని, భారత ప్రజలపై క్లినికల్ పరీక్షల నిర్వహణ ఆవశ్యకతను ప్రత్యేక నిబంధనల కింద రద్దు చేయాలని దానిలో కోరింది.
ఇక దేశంలో ఐదు వ్యాక్సిన్లు అడ్వాన్స్ దశలో ఉన్నాయి. అస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ రూపొందిస్తున్న టీకా మూడో దశ ట్రయల్స్ సీరం నిర్వహిస్తుండగా.. భారత్‌బయోటెక్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఫైజర్ టీకాను మైనస్ సెంటిగ్రేట్ ఉష్ణోగ్రతల్లో భద్రపరచాలి. టీకా వినియోగం ఎలా ఉన్నప్పటికీ ట్రాన్స్‌ఫోర్ట్, భద్రపరిచే విధానం ఖర్చుతో కూడుకొని ఉంటాయి. మరి డిజిసిఐ అనుమతులు మంజూరు చేస్తుందా చూడాలి.