బిగ్‌బాస్‌ నుంచి అవినాష్‌ ఔట్‌..!

Avinash eliminated from Bigg boss .. బిగ్‌బాస్‌ రియాలిటీ షో తుది దశకు చేరుకుంది. మొదటి సీజన్‌ నుంచి ఎంతో పాపులారిటీ

By సుభాష్  Published on  6 Dec 2020 7:30 AM IST
బిగ్‌బాస్‌ నుంచి అవినాష్‌ ఔట్‌..!

బిగ్‌బాస్‌ రియాలిటీ షో తుది దశకు చేరుకుంది. మొదటి సీజన్‌ నుంచి ఎంతో పాపులారిటీ పొందుతున్న బిగ్‌బాస్‌.. నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో అభిజిత్‌, హారిక, అవినాస్‌, అఖిల్‌, మోనాల్‌లు ఉన్నారు. శనివారం రాత్రి ప్రసారం అయిన షోలో అభిల్‌ సేవ్‌ అయ్యాడు. ఇక మిగిలిన నలుగురు ఎలిమినేషన్‌లో ఉన్నారు.

ఇక ఎప్పటిలాగే ప్రతి వారం ఒకరిని హౌస్‌ నుంచి పంపించేయడం జరుగుతున్న తంతు. ఇక ఓటింగ్‌ శాతంలో అభిజిత్‌ అగ్రస్థానంలో ఉండగా, హారిక కూడా సేవ్‌ అయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరోసారి బిగ్‌బాస్‌ దత్తపుత్రిక అయిన మోనాల్‌ ఈ వారం కూడా ఎలిమినేషన్‌ నుంచి సేవ్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ 13వ వారంలో జబర్దస్త్‌ అవినాష్‌ను బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయి ఇంటికి వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. అయితే ప్రతి వారం హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతున్నారనే విషయం బయటకు లీకవుతోంది. ఇప్పటికే లీకుల విషయంలో నాగార్జున సైతం బిగ్‌బాస్‌లో పని చేసేవారిపై మండిపడ్డారు కూడా. లీకులు కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అయితే ఏ మాత్రం ఆగడం లేదు. అంతేకాకుండా బిగ్‌బాస్‌ నుంచి అవినాష్‌ ఎలిమినేట్‌ అయ్యారని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మరీ ఎవరు ఎలిమినేట్‌ అయ్యారనే విషయం అధికారికంగా ఈ రోజు తెలిసిపోనుంది.

నిజానికి ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లలో మోనాల్‌, అవినాష్‌లు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. అందరికంటే తక్కువ ఓట్లు అవినాష్‌కు రావడంతో హౌస్‌ నుంచి బయటకు పంపించేసినట్లు వినికిడి. అలాగే అవినాష్‌ ప్రవర్తిస్తున్న తీరుకు అభిమానులు కొద్ది రోజులుగా నిరాశ చెందుతున్నారు. దీంత ఆయనకు ఓట్లు వేయలేదని తెలుస్తోంది.

Next Story