న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

December 1st Top 10 News .. గ‌త‌ కొన్ని రోజులుగా విజయశాంతి వ్యవహారం తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్పై

By సుభాష్  Published on  1 Dec 2020 12:47 PM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1. కాషాయ మాస్క్‌తో రాముల‌మ్మ‌.. బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు చేసుకున్న‌ట్టేనా.?

గ‌త‌ కొన్ని రోజులుగా విజయశాంతి వ్యవహారం తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్న రాములమ్మ.. బీజేపీలోకి వెళ్తారని ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తూ.. బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలవేళ ఆమె బీజేపీలో చేరుతారని ప్రచారం జోరుగా సాగింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. శివ‌సేన‌లో చేరిన బాలీవుడ్ న‌టి ఊర్మిళ

ప్రముఖ బాలీవుడ్ న‌టి, మాజీ కాంగ్రెస్ నాయ‌కురాలు ఊర్మిళ మటోండ్క‌ర్‌ మంగళవారం శివసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సమక్షంలో ఊర్మిళ పార్టీ కండువా కప్పుకున్నారు. సీఎం స‌తీమ‌ణి ర‌ష్మీ ఠాక్రే శివ‌సేన కండువా క‌ప్పి ఊర్మిళ‌ను పార్టీలోకి ఆహ్వానించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జేసీ దివాక‌ర్‌రెడ్డికి భారీ షాక్‌.. రూ.100కోట్లు జ‌రిమానా

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఏపీ మైనింగ్ అధికారులు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారంలో రూ.100 కోట్ల జ‌రిమానా విధించాల‌ని నిర్ణ‌యించారు. ఒక‌వేళ ఈ జ‌రిమానా క‌ట్ట‌క‌పోతే ఆర్అండ్ఆర్ చ‌ట్టం కింద ఆస్తుల జ‌ప్తు చేయ‌డతామ‌ని హెచ్చ‌రించారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపి 14 లక్షల మెట్రిక్ టన్నుల దోపిడీ జరిగినట్లు గుర్తించారు. విలువైన లైమ్ స్టోన్‌ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వి విక్రయించారని అభియోగాలు నమోదు చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హీరో క‌ల‌ని నెర‌వేర్చిన త‌ల్లి

త‌మిళ హీరో శింబు త‌న త‌ల్లి ఉషా రాజేందర్ నుంచి ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్ అందుకున్నాడు. బ్రిటీష్ రేసింగ్ కారు మినీ కూపర్‌ను శింబుకు బహుమతిగా ఇచ్చారు ఉషా. చాలా రోజులుగా శింబు మనసులో ఉన్న కోరికను పసిగట్టిన ఉష తాజాగా అతడి కోరికను నెరవేర్చింది. దీని ధ‌ర దాదాపు రూ.50 లక్షలని తెలుస్తోంది. త‌ల్లి ఇచ్చిన గిఫ్ట్‌కు శింబు తెగ సంతోషించాడ‌ట‌. గత కొన్ని నెలలుగా శింబు వ్యక్తిగత వృత్తిపరమైన కంబ్యాక్ కోసం చాలా కష్టపడుతున్నాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఏడు సార్లు వ‌ర‌ల్డ్ చాంపియ‌న్.. అయినా వ‌ద‌ల‌ని క‌రోనా

క‌రోనా వైర‌స్ ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డం లేదు. పేద‌, ధ‌నిక అన్న తేడా లేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి భారిన ప‌డుతున్నారు. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా చాలా క్రీడ‌లు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు క్రీడాకారులు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి కోలుకున్నారు. తాజాగా ఫార్ములా వ‌న్ వ‌రల్డ్ ఛాంపియ‌న్ లూయిస్ హామిల్ట‌న్ క‌రోనా బారిన ప‌డ్డాడు. సోమ‌వారం నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో పాజిటివ్‌గా వ‌చ్చింది. దీంతో.. ఏడుసార్లు ఎఫ్ 1 చాంపియ‌న్‌గా నిలిచి చ‌రిత్ర సృష్టించిన హామిల్ట‌న్‌.. సాఖిర్ గ్రాండ్ ప్రికి దూర‌మ‌వుతున్న‌ట్లు మెర్సెడీజ్‌-ఏఎంజీ పెట్రొనాస్ ఎఫ్‌1 టీమ్ తెలిపింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీ-పోలింగ్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మందకోడిగా కొనసాగుతున్న ఈ పోలింగ్‌లో అక్కడక్కడ పలు ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇక ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తారుమారయ్యాయి. దీంతో అక్కడి పోలింగ్‌ను రద్దు చేసి రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. ఆ డివిజన్‌లో ఉన్న 69 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌ ఉంటుందని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. గ్రేటర్‌ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు కనీసం 20 శాతం కూడా పోలింగ్‌ శాతం నమోదు కాకపోవడం గమనార్హం. ఓల్డ్‌ మలక్‌పేటలో సీపీఐ ,సీపీఎం గుర్తు విషయంలో పొరపాటు జరిగినట్లు తెలుస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సినిమా ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పిన మహేష్ బాబు సినిమా థియేటర్లు

హైదరాబాద్ లో మహేష్ బాబుకు చెందిన సినిమా థియేటర్లు ఉన్న సంగతి తెలిసిందే..! హైదరాబాద్ లోని 'ది బెస్ట్' సినిమా థియేటర్స్ గా అతి తక్కువ సమయంలోనే 'ఏఎంబీ' సినిమా థియేటర్లు పేరును సంపాదించుకున్నాయి. ఇన్ని రోజులు సినిమా థియేటర్లు మూతబడడంతో ఈ మల్టీప్లెక్స్ చైన్ కూడా మూతపడింది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం సినిమా థియేటర్లు తెరుచుకోవడంపై అనుమతులు ఇవ్వడంతో పలు సినిమా థియేటర్ల యాజమాన్యాలు పునరుద్ధరణ చేయడానికి ముందుకు వచ్చాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జీహెచ్ఎంసీ ఎన్నికలు : ఒక పార్టీ గుర్తుకు బదులు మరో పార్టీ సింబల్

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో చిత్ర‌మైన ఘ‌ట‌న వెలుగుచూసింది. వివ‌రాళ్లోకెళితే.. ఓల్డ్ మలక్ పేట్ వార్డ్ నంబర్ 26 లో సిపిఐ అభ్యర్థిగా ఫిర్థోసి ఫాతిమా ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఆమె నామినేషన్ అంగీకరించి.. కంకి కొడవలి గుర్తును కేటాయించడం జరిగింది. కానీ బ్యాలెట్ పత్రం లో కంకి కొడవలి గుర్తుకు బదులుగా.. సుత్తి కొడవలి గుర్తు వచ్చింది. ఇది ఎన్నికల వ్యవస్థ చేసినటువంటి పొరపాటని తక్షణమే ఓల్డ్ మలక్ పేట్‌ 26 వ వార్డు ఎన్నికలను నిలిపివేయాలని సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటీ. నరసింహ డిమాండ్ చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత‌

నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Fact Check : మారడోనా సమాధి వద్ద పీలే నివాళులు అర్పిస్తూ కనిపించారా..?

ట్ బాల్ దిగ్గజం డియాగో మారడోనా ఇటీవలే మరణించారు. ఆయన మరణవార్త క్రీడా దిగ్గజాలను కలచివేసింది. బ్రెజిల్ ఫుట్ పాల్ దిగ్గజం పీలే కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇంతలో సామాజిక మాధ్యమాల్లో ఓ ఫోటో వైరల్ అవుతూ ఉంది. మారడోనా సమాధి వద్దకు వెళ్లిన పీలే బాధతో ఉన్న ఫోటో అది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Next Story