శివసేనలో చేరిన బాలీవుడ్ నటి ఊర్మిళ
Urmila Matondkar Join In Shiv Sena. ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ కాంగ్రెస్ నాయకురాలు ఊర్మిళ మటోండ్కర్ మంగళవారం శివసేన
By Medi Samrat Published on 1 Dec 2020 4:09 PM ISTప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ కాంగ్రెస్ నాయకురాలు ఊర్మిళ మటోండ్కర్ మంగళవారం శివసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సమక్షంలో ఊర్మిళ పార్టీ కండువా కప్పుకున్నారు. సీఎం సతీమణి రష్మీ ఠాక్రే శివసేన కండువా కప్పి ఊర్మిళను పార్టీలోకి ఆహ్వానించారు.
ఊర్మిళ శివసేనలో చేరుతున్నారంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాను శివసేనలో చేరడంలేదంటూ ఊర్మిళ ప్రకటన చేసినట్టుగానూ కొన్ని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తనపై జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ.. ఈ ఉదయం ఊర్మిళ శివసేన సభ్యత్వం తీసుకున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన ఊరిళ్మ తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో ముంబయి నార్త్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లోని కొన్ని రాజకీయాల కారణంగానే తాను పార్టీకి దూరం అవుతున్నానని.. అక్కడ పెద్ద లక్ష్యం కోసం పని చేయడానికి బదులు అంతర్గత రాజకీయాలు.. పార్టీలోని స్వార్థ ప్రయోజనాలతో పోరాటం చేయడం చాలా కష్టమంటూ అప్పట్లో ఉర్మిళ ఆగ్రహాం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన 12 స్థానాలను భర్తీ చేసేందుకు ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం కొంత మంది పేర్లను సిఫార్సు చేసింది. ఇందులో ఊర్మిళ పేరు కూడా ఉంది.
जय महाराष्ट्र 🙏🏼🙏🏼🚩🚩🚩 pic.twitter.com/sUinOcagrP
— Urmila Matondkar (@UrmilaMatondkar) December 1, 2020