టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత‌

Nomula Narsimhaiah Passes Away. నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు.

By Medi Samrat  Published on  1 Dec 2020 2:29 AM GMT
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత‌

నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు.

నోముల నర్సింహయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా నిలిచి పోతారని సీఎం అన్నారు. ఆయన మరణం టీఆర్‌ఎస్‌ పార్టీకి, నియోజక వర్గం ప్రజలకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Next Story
Share it