హీరో క‌ల‌ని నెర‌వేర్చిన త‌ల్లి

Simbu's mother gifts him a luxury car.. త‌మిళ హీరో శింబు త‌న త‌ల్లి ఉషా రాజేందర్ నుంచి ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్ అందుకున్నా

By సుభాష్  Published on  1 Dec 2020 10:30 AM GMT
హీరో క‌ల‌ని నెర‌వేర్చిన త‌ల్లి

త‌మిళ హీరో శింబు త‌న త‌ల్లి ఉషా రాజేందర్ నుంచి ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్ అందుకున్నాడు. బ్రిటీష్ రేసింగ్ కారు మినీ కూపర్‌ను శింబుకు బహుమతిగా ఇచ్చారు ఉషా. చాలా రోజులుగా శింబు మనసులో ఉన్న కోరికను పసిగట్టిన ఉష తాజాగా అతడి కోరికను నెరవేర్చింది. దీని ధ‌ర దాదాపు రూ.50 లక్షలని తెలుస్తోంది. త‌ల్లి ఇచ్చిన గిఫ్ట్‌కు శింబు తెగ సంతోషించాడ‌ట‌.

గత కొన్ని నెలలుగా శింబు వ్యక్తిగత వృత్తిపరమైన కంబ్యాక్ కోసం చాలా కష్టపడుతున్నాడు. తన కృషికి బహుమతిగా ఉషా అతనికి మినీ కూపర్ కారు కానుకగా ఇచ్చారట. ఆకుపచ్చ మినీ కూపర్ కొద్ది రోజుల క్రితం వారి ఇంటికి వచ్చింది. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా తన కొత్త కారును ప్రయాణానికి తీసుకువెళుతున్నాడట శింబు. తాజాగా షేర్ చేసిన ఫోటోలో ఉషా రాజేందర్.. ఆపి ఉంచిన కారు పక్కన నిలబడి కనిపిస్తున్నారు. ఆమె గులాబీల గుత్తిని పట్టుకుని కనిపించారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే..శింబు ప్రస్తుతం సుశీంద్రన్ దర్శకత్వంలో 'ఈశ్వరన్' అనే మూవీ చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో శింబు సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. దీపావ‌ళి సంద‌ర్భంగా 'ఈశ్వరన్‌' సినిమాకి పని చేసిన 400 మందికి ఒక గ్రాము బంగారు నాణెం బహుమతిగా ఇచ్చాడు శింబు. అలాగే 200 మంది జూనియర్‌ ఆర్టిస్టులకు బట్టలు పెట్టారు. ప్ర‌స్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు 'మానాడు'లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ పాండిచ్చేరిలో జరుగుతోంది.

Next Story
Share it