సినిమా ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పిన మహేష్ బాబు సినిమా థియేటర్లు
Mahesh babu AMB Mall will open on december 4th. హైదరాబాద్ లో మహేష్ బాబుకు చెందిన సినిమా థియేటర్లు ఉన్న సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on
1 Dec 2020 6:51 AM GMT

హైదరాబాద్ లో మహేష్ బాబుకు చెందిన సినిమా థియేటర్లు ఉన్న సంగతి తెలిసిందే..! హైదరాబాద్ లోని 'ది బెస్ట్' సినిమా థియేటర్స్ గా అతి తక్కువ సమయంలోనే 'ఏఎంబీ' సినిమా థియేటర్లు పేరును సంపాదించుకున్నాయి. ఇన్ని రోజులు సినిమా థియేటర్లు మూతబడడంతో ఈ మల్టీప్లెక్స్ చైన్ కూడా మూతపడింది.
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం సినిమా థియేటర్లు తెరుచుకోవడంపై అనుమతులు ఇవ్వడంతో పలు సినిమా థియేటర్ల యాజమాన్యాలు పునరుద్ధరణ చేయడానికి ముందుకు వచ్చాయి. తాజాగా ఏఎంబీ సంస్థ కూడా అందుకు తగ్గట్టుగా సమాయత్తమవుతోంది. ఏఎంబీ మల్టీప్లెక్స్ గ్రూప్ డిసెంబర్ 4 నుండి థియేటర్స్ తెరవనున్నట్టు ప్రకటించింది.
ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ అంటూ ఓ పోస్టర్ విడుదల చేస్తూ డిసెంబర్ 4 నుండి థియేటర్స్‌లో షోలు మొదలుకానున్నాయని చెప్పింది. 50 శాతం ఆక్యుపెన్సీతో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్స్ రన్ చేయనున్నారు. ఇక రాబోయే రోజుల్లో సినిమాలు విడుదల అవుతూ ఉండడంతో ఏఎంబీలో కూడా కొత్త సినిమాలను హ్యాపీగా చూసుకోవచ్చన్నమాట.
Next Story