న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
పాకిస్థాన్‌కు భారీ షాక్ తగలనుంది. తమ దేశంలో ఉన్న 860 మంది పైలట్లలో దాదాపు 262 మంది బోగస్ పైలట్లేనన్న
By సుభాష్ Published on 9 Nov 2020 1:46 PM GMT1. పాక్‌కు భారీ షాక్.. 188 దేశాల్లో పాక్ ఎయిర్‌లైన్స్ రాకపోకలపై నిషేధం
పాకిస్థాన్‌కు భారీ షాక్ తగలనుంది. తమ దేశంలో ఉన్న 860 మంది పైలట్లలో దాదాపు 262 మంది బోగస్ పైలట్లేనన్న ప్రకటన పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. లైసెన్స్ కుంభ కోణం కారణంగా దాదాపు 188 దేశాల్లో పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ రాకపోకలపై నిషేధం విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రమాణాలు పాటించకుండా నిబంధనలకు విరుద్దంగా పైలట్ లైసెన్స్‌లు జారీ చేసిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. దుబ్బాక కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.. టెన్షన్ కూడా పీక్స్
దుబ్బాక ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపి ఉంటారోనని తెలంగాణలో సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. నవంబర్ 10న ఫలితాలు వస్తూ ఉండడంతో అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తీ అయ్యాయి. కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లును అధికారులు పూర్తిచేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, సీపీ జోయల్ డేవిస్‌లు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3.రెండు కోట్ల మంది 'బిగ్ బాస్కెట్' వినియోగదారుల డేటా లీక్.. అమ్మకానికి రెడీ
మరో అతి పెద్ద డేటా లీక్ ఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్కెట్ కంపెనీకి చెందిన రెండు కోట్ల మందికి పైగా యూజర్ల వ్యక్తిగత డేటా హ్యాకింగ్‌కు గురైంది. ఇంతకు ముందే వార్తలు రాగా ఈ విషయాన్ని స్వయంగా బిగ్‌బాస్కెట్ ధృవీకరించడంతో షాక్ తిన్నారు వినియోగదారులు. తమ కంపెనీ పై హ్యకర్లు దాడి చేశారని బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తమ సంస్థకు చెందిన 2 కోట్లకు పైగా ఖాతాదారుల డేటా చోరీకి గురైందని ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా హ్యాకర్లు ఈ డేటాను రూ. 30 లక్షలకు డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4.విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
సినీ నటి, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్, తెలంగాణ రాములమ్మ విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ పార్టీని విమర్శిస్తూ బీజేపీకి సానుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కోలుకోలేదేమో అన్నట్లు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్యం ఠాగూర్ కాస్త ముందుగా బాధ్యతలు చేపడితే బాగుండేదని అనడం అన్నారు. ఇప్పుడు విజయశాంతి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. టీవీ జర్నలిస్టు దారణ హత్య
తమిళనాడు: ఓ తమిళ టీవీ రిపోర్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. అక్రమాలను ప్రశ్నించినందుకు కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా కుండ్రత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పోరంబోకు భూమిని అక్రమంగా అమ్ముతున్న కొందరికి వ్యతిరేకంగా మోజెస్ (25) కొంతకాలంగా వార్తలు రాస్తుండటమే ఈ హత్యకు కారణమని తెలిసింది. ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న దుండగులు గతంలో పలు మార్లు మోజెస్‌ను బెదిరించినట్లు తెలుస్తోంది. తమ దారికి రావొద్దని హెచ్చరించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6.Fact Check : అమెరికా ఎన్నికల్లో ఓట్ల రిగ్గింగ్ చోటు చేసుకుందంటూ పోస్టులు వైరల్..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎంతో ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే..! ట్రంప్ ఈ ఎన్నికల్లో చాలా అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ వస్తున్నాడు. చాలా చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి తమ ప్రతినిధులను కనీసం పంపలేదని ట్రంప్ వర్గం ఆరోపించిన సంగతి తెలిసిందే..! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా రిగ్గింగ్ జరిగిందంటూ కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. బ్యాలట్ బాక్సుల్లోకి అధికారులే ఓట్లు వేస్తున్న సీసీటీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. దేశంలో పలు రాష్ట్రాల్లో బాణాసంచాపై పూర్తి నిషేధం
దీపావళి పండగ వచ్చేస్తోంది. టపాసులతో మోత మోగిపోతుంది. దీంతో కాలుష్యం కూడా బాగానే అవుతుంది. ఇక దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి అప్రమత్తం అయ్యాయి. దీపావళి బాణాసంచాతో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు దేశంలో పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో నవంబర్ 9 అర్ధరాత్రి నుంచి నవంబర్ 30 వరకు అన్ని రకాల బాణాసంచా అమ్మకాలు, వినియోగంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునరల్ సంపూర్ణ నిషేధం విధించింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8.హర్మన్ vs మంధాన.. టైటిల్ ఎవరిదో..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫైనల్‌కు ముందు మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్దమైంది. సోమవారం జరిగే మహిళల టీ20 ఛాలెంజ్ 2020 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్‌నోవాస్ జట్టు ట్రయల్‌బ్లేజర్స్‌తో తలపడనుంది. హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని జట్టు వరుసగా మూడో టైటిల్‌పై కన్నేయగా.. స్మృతి మంధాన జట్టు తొలి ట్రోఫీ కోసం ఆరాటపడుతోంది. లీగ్ దశ చివర మ్యాచ్‌లో బ్లేజర్స్‌పై సూపర్‌నోవాస్ గెలువడంతో రెండు జట్లు తుదిపోరుకు చేరగా.. నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో మిథాలీరాజ్ కెప్టెన్సీలోని వెలాసిటీ ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9.అమెరికా అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ.. ఇవే కీలక దశలు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తయిందా..?అంటే ఇంకా ఉందనే చెప్పాలి. 538 మంది ఎలక్ట్రార్లు అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ఇంకా చాలా మిగిలి ఉంది. ఎన్నికలు పూర్తయినా.. కీలక దశలు ఇవే.. అయితే అధ్యక్షుడి ఎన్నికలు పూర్వయినా కీలక దశలు మిగిలి ఉన్నాయి. అమెరికా ప్రజలు నేరుగా అధ్యక్షుడికి ఓటు వేయరు. వారు తమ రాష్ట్రంలో ఎలక్ట్రార్లను ఎన్నుకుంటారు. వీరంతా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అయితే ఎన్నికల తర్వాత రాష్ట్రాలు, ఎవరికి ఎన్ని పాపులర్ ఓట్లు వచ్చాయో నిర్ణయస్తారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10.తొలిసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్
ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ నిరీక్షణ ఫలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సుదీర్ఘ నిరీక్షణ తరువాత తొలిసారి ఢిల్లీ ఫైనల్ చేరింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 17 పరుగులతో చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. ఫైనల్‌లో ఢిపెండింగ్ చాంఫియన్ ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (50 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' స్టొయినిస్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్),.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి