న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
November 10th top 10 News I దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలకశాఖ మం
By సుభాష్ Published on 10 Nov 2020 5:56 PM IST1. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై కేటీఆర్ ఏమన్నారంటే..
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయాలకు పొంగిపోమని, అపజయాలకు కుంగిపోమని కేటీఆర్ అన్నారు. 2014 నుండి జరిగిన ఎన్నికల్లో తాము విజయాలను నమోదు చేశామని.. ఏ ఎన్నికల్లో గెలిచినప్పుడైనా పార్టీ అధ్యక్షుడుగానీ, నాయకులు గానీ.. పొంగిపోలేదన్నారు...పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2.గెలుపు వాకిట చతికిలపడ్డ టీఆర్ఎస్.. దుబ్బాక బీజేపీదే..!
నరాలు తెగే ఉత్కంఠ కలిగించిన దుబ్బాక ఉప పోరులో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు జయకేతనం ఎగురవేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై 1470 ఓట్ల మెజార్టీతో రఘునందన్‌రావు గెలుపొందారు. దీంతో కాషాయ పార్టీలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ విజయంతో బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3.వచ్చే ఎన్నికలకు ఇది ట్రైలర్ మాత్రమే
దేశంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ, ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. తీవ్ర ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న ఈ ఓట్ల లెక్కింపుల్లో బీజేపీ దూసుకుపోతోంది. తాజాగా తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నిక స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఇక గుజరాత్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇక్కడ ఉప ఎన్నికలు జరిగిన 8 నియోజకవర్గాల్లో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసే విధంగా ఆధిక్యంలో కొనసాగుతోంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4.సెంటిమెంట్లు ఢిల్లీ వైపే.. ముంబై కప్ ను ముద్దాడేనా..!
కొన్ని కొన్ని సార్లు ఏదైనా టోర్నమెంట్లలో సెంటిమెంట్లు చాలా కీలకంగా ఉంటాయి. ఐపీఎల్-2020 ఫైనల్స్ ముందు కూడా ఇలాంటి సెంటిమెంట్లే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఐపీఎల్ 2020 ఫైనల్ లో ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ కేపిటల్స్ జట్టు తలపడనుంది. ముంబై ఇండియన్స్ ను కొన్ని సెంటిమెంట్స్ టెన్షన్ పెడుతున్నాయి. ప్రతీ లీప్ సంవత్సరంలో ఐపీఎల్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. ప్రారంభ సీజన్ 2008లో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ అందుకోగా.. 2012లో కోల్‌కతా నైట్ రైడర్స్.. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నయా చాంపియన్లుగా నిలిచాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5.గ్రేటర్ భాగ్యనగరానికి మరో మణిహారం
గ్రేటర్ భాగ్యనగరానికి మరో మణిహారం వచ్చి చేరింది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ మంగళవారం ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలోనే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తొలి ప్లాంట్ ఇదే. జవహార్‌నగర్‌లోఇన ఈ ప్లాంట్ మొదటి దశ పనులు ప్రయోగాత్మకంగా ఇప్పటికే ప్రారంభం కాగా, మంత్రి కేటీఆర్ లాంఛనంగా మంగళవారం ప్రారంభించారు. కేటీఆర్‌తో పాటు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ తదితరులున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. రిపబ్లిక్ టీవీకి మరిన్ని కష్టాలు
రిపబ్లిక్ టీవీ ఒకప్పుడు ఎన్నో బ్రేకింగ్ న్యూస్ అందించేది. కానీ ఆ మీడియా సంస్థనే బ్రేకింగ్ న్యూస్ లో నిలిచింది. ఓ వైపు అర్నాబ్ గోస్వామి అరెస్టు విషయంలో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉండగా.. మరోవైపు టీఆర్పీ స్కామ్ ఆ ఛానల్ ను మరింత కష్టాల్లోకి నెట్టేసింది. టీఆర్‌పీ స్కామ్‌కు సంబంధించి 'రిపబ్లిక్ టీవీ' డిస్స్ర్టిబ్యూషన్ హెడ్ ఘన్శ్యామ్ సింగ్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ధర్మారెడ్డి ఆత్మహత్య కేసు: మాజీ ఎమ్మెల్యేపై కుటుంబ సభ్యుల సంచలన ఆరోపణలు
రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన కీసర తహసీల్దారు కోటి రూపాయల లంచం కేసులో మరో నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మాజీ తహసీల్దారు నాగరాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ధర్మారెడ్డి ఆత్మహత్యకు సంబంధించి కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. 97 ఎకరాల భూ వివాదంలో రాజకీయ నేతల ప్రమోయం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ధర్మారెడ్డి సూసైడ్‌పై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. మహేష్ చరిత్రలో నిలిచిపోతారు : సీఎం కేసీఆర్
జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ మహేశ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా మహేశ్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. మహేశ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ. 50లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. మహేశ్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని వెల్లడించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9.సరిహద్దుల్లో ఉద్రిక్తల తర్వాత తొలిసారి.. నేడు చైనా అధ్యక్షుడితో మోదీ ముఖాముఖి
ఈ ఏడాది మే నెలలో చైనా సరిహద్దుల్లో జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశల మధ్య ద్వైపాక్షిక దూరాన్ని పెంచగా, ఈరోజు మొదటి సారిగా ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీజిన్ పింగ్‌తో ముఖాముఖి మాట్లాడనున్నారు. దీనికి నేడు జరిగే 20వ ఎస్సీఓ అధినేత సమావేశం వేదిక కానుంది.వర్చ్యువల్ గా కొనసాగే ఈ వేదికలో ఉగ్రవాదం, భారత సార్వభౌమత్వంలో జరుగుతున్న దాడులు,ప్రత్యామ్నాయ దాడులు, ఇంధన వనరుల అభివృద్ధి, కరోనా కట్టడి తదితర అంశంపై మోదీ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10.బ్యాంకు ఉద్యోగాల పేరిట భారీ టోకరా.. ఏపీ, తెలంగాణలో 220 మంది బాధితులు
మోసాలను పోలీసులు ఎన్ని విధాలుగా అరికట్టినా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసగిస్తూ నిలువునా దోచుకుంటున్నారు. తాజాగా ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి కేంద్రంగా కో ఆపరేటివ్ సొసైటీ పేరుతో బ్యాంకు ప్రారంభించామని, అందులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెబుతూ రూ. లక్షల్లో నగదు తీసుకుని తమను మోసం చేశారంటూ బధితురాలు సోమవారం గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై దర్యాప్తునకు అధికారులను ఆదేశించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి