సరిహద్దుల్లో ఉద్రిక్తల తర్వాత తొలిసారి.. నేడు చైనా అధ్యక్షుడితో మోదీ ముఖాముఖి

Modi, XI Jinping to meet SCO Summit ఈ ఏడాది మే నెలలో చైనా సరిహద్దుల్లో జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశల

By సుభాష్  Published on  10 Nov 2020 5:43 AM GMT
సరిహద్దుల్లో ఉద్రిక్తల తర్వాత తొలిసారి.. నేడు చైనా అధ్యక్షుడితో మోదీ ముఖాముఖి

ఈ ఏడాది మే నెలలో చైనా సరిహద్దుల్లో జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశల మధ్య ద్వైపాక్షిక దూరాన్ని పెంచగా, ఈరోజు మొదటి సారిగా ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీజిన్‌ పింగ్‌తో ముఖాముఖి మాట్లాడనున్నారు. దీనికి నేడు జరిగే 20వ ఎస్సీఓ అధినేత సమావేశం వేదిక కానుంది.వర్చ్యువల్ గా కొనసాగే ఈ వేదికలో ఉగ్రవాదం, భారత సార్వభౌమత్వంలో జరుగుతున్న దాడులు,ప్రత్యామ్నాయ దాడులు, ఇంధన వనరుల అభివృద్ధి, కరోనా కట్టడి తదితర అంశంపై మోదీ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అధ్యక్షతన కొనసాగనుండగా, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కూడా పాల్గొననున్నారు.

ఈ సమావేశంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ముందే ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలకు మోదీ సీరియస్‌గా వార్నింగ్‌ ఇస్తారని తెలుస్తోంది. ఆయా దేశాలు తక్షణమే ఉగ్రవాదాన్ని వదిలేయాలని, అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోవాలని మోదీ డిమాండ్‌ చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం జరిగి 75 ఏళ్లు పూర్తి కావడం, కరోనాపై పోరాటం, ఉగ్రవాదం తదితర అంశాలపై ఎస్సీఓ సమావేశం అనంతరం ప్రకటన వెలువడనున్నాయి.


Next Story